జగన్ ఎక్కడ? తనపై ఉన్న 26 కేసులకు భయపడి దాక్కున్నారా ? : లోకేష్

వాస్తవం ప్రతినిధి: ప్రధాని మోదీ గుంటూరు పర్యటన నేపథ్యంలో బీజేపీ, వైసీపీలపై ఏపీ మంత్రి నారా లోకేశ్ మండిపడ్డారు. ఏపీకి అన్యాయం చేసిన మోదీ రాష్ట్రానికి వస్తుంటే కేసులకు భయపడి జగన్ దాక్కున్నారని విమర్శించారు.

ఈరోజు ట్విట్టర్ లో లోకేశ్ స్పందిస్తూ..‘మోదీ గారి పర్యటన సందర్భంగా రాష్ట్రమంతా ఒక్కటై రోడ్డెక్కి హోదా కోసం పోరాడుతుంటే ప్రతిపక్ష నేత జగన్ ఎక్కడ? వైకాపా నాయకులు ఎక్కడ? 26 కేసులుకు బయపడి జగన్ దాక్కున్నారా? అరెస్ట్ చేసి జైలు కి పంపుతారు అని భయం పట్టుకుందా? లేక లోటస్ పాండ్ లో పడుకున్నారా?’ అని వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. దీనికి #GoBackModi #ModiIsaMistake హ్యష్ ట్యాగ్ ను జతచేశారు.