మోదీ గో బ్యాక్ అంటూ రాష్ట్రవ్యాప్తంగా హోరెత్తిన నిరసనలు

వాస్తవం ప్రతినిధి: ప్రధాని మోదీ పర్యటనపై ఏపీలో నిరసనలు హోరెత్తాయి. మోదీ గో బ్యాక్ అంటూ గుంటూరు, తాడేపల్లి తదితర ప్రాంతాల్లో నిరసనకారులు పెద్దఎత్తున నినాదాలు చేస్తూ.. నల్లబ్యాడ్జీలు ధరించి ఆందోళన చేపట్టారు. టీడీపీ ఇతర విపక్ష కార్యకర్తలు రోడ్లపై మోదీ దిష్టి బొమ్మను తగులబెట్టారు. మహిళలు ఖాళీ కుండలు, నీళ్ళతో ప్రొటెస్ట్ చేశారు. ఏపీకి హోదా ఇవ్వకుండా ఏ ముఖం పెట్టుకుని రాష్ట్రానికి వస్తున్నారని వారు ప్రశ్నించారు. దుర్ఘా ఘాట్ లో హోదా సాధన సమితి నేత, నటుడు శివాజీ జలదీక్షలో పాల్గొన్నారు. . అయితే ఈ నిరసనలను పట్టించుకోని మోదీ ఆదివారం ఉదయం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో సుమారు పదిన్నర గంటలకు గన్నవరం ఎయిర్ పోర్ట్ చేరుకున్నారు. విమానాశ్రయంలో ఆయనకు గవర్నర్ నరసింహన్, ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తదితరులు స్వాగతం పలికారు.