చంద్రబాబు సీనియరే.. మామకు వెన్నుపోటు పొడవడంలో సీనియర్!: ప్రధాని మోదీ సెటైర్లు

వాస్తవం ప్రతినిధి: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మాటిమాటికీ ‘నేను మోదీ కంటే సీనియర్’ అని చెప్పుకుంటున్నారని మోదీ ఎద్దేవా చేశారు. తన కంటే చంద్రబాబు సీనియర్ అయితే వచ్చిన ఇబ్బంది ఏంటని ప్రశ్నించారు. గుంటూరు జిల్లా ఏటుకూరులో ఈరోజు జరిగిన ప్రజా చైతన్య సభలో మోదీ మాట్లాడారు.
మాట మార్చడంలో, పోత్తులు మార్చడంలోనూ, పిల్లనిచ్చిన మామను వెన్నుపోటు పొడవడంలోనూ చంద్రబాబు చాలా సీనియర్ అని మోడీ ఎద్దేవా చేశారు. ఎన్నికలలో ఓడిపోవడం లో కూడా చంద్రబాబు సీనియర్ అనీ, అందులో ఆయనతో తాను పోటీ పడలేనని మోడీ అన్నారు. చంద్రబాబు సీనియారిటీని తాను గౌవరించాననీ, అయితే ప్రజాసంక్షేమం నుంచి ఆయన పక్కకు వెళ్లిపోయారని మోడీ విమర్శించారు. ఈరోజు ఓ రాజకీయ పార్టీని తిట్టి, రేపు వారి ఒళ్లోనే కూర్చోవడంలో కూడా చంద్రబాబు సీనియర్ అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.