“బాబు” లో.. టెన్షన్…టెన్షన్..!!!

వాస్తవం ప్రతినిధి: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిపై వివిధ పార్టీలు మూకుమ్మడి దాడి చేస్తున్నాయి. ఏపీలో ప్రధాన ప్రతిపక్షం వైసీపీ మొదలు, జనసేన , సీపీఎం ,సీపీఐ లు సైతం బాబు పై విమర్శలు ఎక్కుపెడుతున్నాయి. చంద్రబాబు నాయుడు ఎపీకి తీరని ద్రోహం చేశారని అంటూనే , ఎన్టీఆర్ కి వెన్నుపోటు పొడిచారు అంటూ పాత నినాదాన్నే కొత్తగా గతకొంత కాలంగా వ్యాఖ్యానిస్తున్నాయి..దాంతో ఒక్క సారిగా బాబు క్రేజ్ కి  బ్రేకులు పడ్డాయని అంటున్నారు. అయితే  బీజేపీ పార్టీ సైతం ఇదే విధమైన వ్యాఖ్యలు చేస్తూ ఏపీ ప్రజల ముందు బాబు ని బూచి చేస్తూ..చంద్రబాబు లో టెన్షన్ రేపుతోంది.

ఇదిలాఉంటే  గతంలో ప్రధాని మోడీ సైతం ఎన్టీఆర్ పై జరిగిన వెన్నుపోటు గురించి బాబు ప్రస్తావన రాకుండానే నేరుగా కాకుండా విమర్శలు చేసిన విషయం విధితమే.ఈ క్రమంలో ఏపీలో మోడీ చేస్తున్న పర్యటన పై సర్వత్ర తీవ్ర ఉత్ఖంఠ నెలకొంది. మోడీ ఏపీలో పర్యటనపై టీడీపీ ఒక పక్క బగ్గుమంటోంది. ఎపీకి న్యాయం చేయలేనపుడు ఏపీ పర్యటనలు ఎందుకు, మోడీ గో బ్యాక్ అంటూ నినాదాలు చేస్తోంది. అంతేకాదు బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించబోతున్న ఈ సభను ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టాలో అన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టాలని డిసైడ్ అయ్యింది టీడీపీ.

ఇక ఏపీలో మోడీ పర్యటనని పరిగణలోకి తీసుకుంటే..ఆదివారం ఉదయం 11.15 గంటలకు గుంటూరు చేరుకొని అక్కడి నుంచీ..ఏటుకూరు బైపాస్‌లో కొన్ని ప్రాజెక్టుల శిలాఫలకాలను ఆవిష్కరిస్తారు. సమీపంలోనే ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మోడీ ప్రసంగిస్తారు. ఈ పర్యటనలో దాదాపు విశాఖలో1,178.35 కోట్లతో ఏర్పాటు చేసిన 1.33 మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్యం కలిగిన చమురు నిల్వ కేంద్రాన్ని, అదేవిధంగా ఓఎన్‌జీసీ రూ.5, 300 కోట్ల అంచనా వ్యయంతో ఏర్పాటు చేసిన కేజీ బేసిన్‌  గ్యాస్ ఫీల్డ్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టుని గుంటూరు సభావేదిక మీదుగా జాతికి అంకితం చేయనున్నారు…ఇలా మరికొన్ని అభివృద్ధి పనులకి ఆయన శంకుస్థాపన చేయనున్నారు.

అయితే ఇప్పుడు ఈ పర్యటన కంటే కూడా మోడీ భహిరంగ సభలో ఏమి మాట్లాడుతారో అనే దానిపైనే అందరి దృష్టి ఉంది. కొంత కాలంగా ప్రధాని మోడీ చంద్రబాబు పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్న విషయం విధితమే , అంతేకాదు ఎన్టీఆర్ ఆనాటి పరిస్థితికి చంద్రబాబు ఎంత కారణమో , కాంగ్రెస్ పార్టీ కూడా అంతే కారణం అంటూ మోడీ బాబు ని ఐ, కాంగ్రెస్ ని కలిపి ఒక్కటిగా చూపించి ఎకేయనున్నారట. ఏపీ ప్రజల దృష్టిలో బాబు , కాంగ్రెస్ కలిసే ఎన్టీఆర్ పై కుట్ర చేశారనే అభిప్రాయం ప్రజలలో కలిగించడమే మోడీ వ్యూహంగా అర్థమవుతోందని అంటున్నారు రాజకీయ పండితులు. ఈ విమర్శలు గనుకా ప్రజలలోకి బలంగా వెళ్తే..తప్పకుండా వచ్చే ఎన్నికల్లో ఈ ప్రభావం టీడీపీ పై చూపుతుందని అంచనాలు వేస్తోంది బీజేపీ. మరి బాబు పై మోడీ వేయనున్న ప్లాన్ వర్కౌట్ అవుతుందా లేదా అనేది వేచి చూడాల్సిందే.