పేదరికం లేని సమాజం కొరకు తెలుగుదేశం ప్రభుత్వం పని చేస్తుంది :మంత్రి నక్కా ఆనందబాబు

వాస్తవం ప్రతినిధి: గుంటూరు జిల్లా వేమూరు నియోజకవర్గం పరిధిలోని బలిజేపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన ఎన్టీఆర్ గృహాలను మంత్రి నక్కా ఆనందబాబు ప్రారంభించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఏ పేదవారు ఇళ్లలేకుండా ఉండకూడదనే ఉద్దేశంతో రాష్ట్రప్రభుత్వం ఇళ్ల నిర్మాణానికి సహాయం చేస్తుందని,పేదరికం లేని సమాజం కొరకు తెలుగుదేశం ప్రభుత్వం పని చేస్తుందన్నారు. వేమూరు నియోజకవర్గం లో 1409 గృహాలను ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు.అలాగే రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ, పట్టణప్రాంతాల్లో 4 లక్షల ఎన్టీఆర్ గృహాలను ప్రారంభించడం జరుగుతుందన్నారు.