విచారణ కమిటీపై హైకోర్టును  ఆశ్రయించిన  అపోలో

వాస్తవం ప్రతినిధి: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత మృతి కేసుపై విచారణ చేపట్టిన కమిటీపై అపోలో ఆసుపత్రి అభ్యంతరం వ్యక్తం చేసింది.విచారణ కమిటీ వాస్తవాలను తప్పుదోవ పట్టిస్తోందని అపోలో ఆరోపించింది. విచారణ కమిటీపై అపోలో హైకోర్టును ఆశ్రయించింది. ఈ విచారణ కమిటీపై స్టే ఇవ్వాలని అపోలో కోరింది.