మోదీ సభను అడ్డుకోవడానికి చంద్రబాబు కుట్రలు పన్నుతున్నారు: కన్నా లక్ష్మీనారాయణ

వాస్తవం ప్రతినిధి: ప్రధాని మోదీ గుంటూరు పర్యటనను అడ్డుకోవడానికి ఏపీ సీఎం చంద్రబాబు కుట్రలు పన్నుతున్నారని బీజేపీ ఏపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. గుంటూరు జిల్లాలో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో కన్నా మాట్లాడారు.బీజేపీ సభకు వాహనాలు అందుబాటులో లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ఆటంకాలు సృష్టిస్తోందని విమర్శించారు. ఈరోజు కార్యాలయాలు సెలవు కాబట్టి రవాణాశాఖ కమిషనర్‌ కార్యాలయం ముందు ధర్నా విరమించుకున్నామన్నారు. అక్రమ సంబంధాలు అంటగట్టి చంద్రబాబు బతుకుతున్నారని విమర్శించారు.

మోదీ ‘ప్రజా చైతన్య సభ’కు బీజేపీ కార్యకర్తలు, మద్దతుదారులను తరలించడానికి బస్సులు ఇవ్వకుండా వేధిస్తున్నారని మండిపడ్డారు.   ప్రస్తుతం దిగజారిన ముఖ్యమంత్రి ఏపీలో ఉన్నారని కన్నా ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ గుంటూరులో రేపు నిర్వహించనున్న ప్రజాచైతన్య సభను భగ్నం చేయాలని చంద్రబాబు టీడీపీ గూండాలకు పిలుపునిచ్చారని ఆరోపించారు.