ఫుట్‌బాల్ క్లబ్‌లో భారీ అగ్ని ప్రమాదం..పది మంది చిన్నారులు సజీవ దహనం

వాస్తవం ప్రతినిధి: బ్రెజిల్‌లోని ఓ ఫుట్‌బాల్ క్లబ్‌లో భారీ అగ్ని ప్రమాదం జర్గింది. ఈప్రమాదంలో పది మంది చిన్నారులు అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు. వీరందరూ పది నుంచి 16 ఏళ్ల లోపు వారే . రియో డి జెనీరోలోనే అత్యంత పెద్దదైన ఫ్లెమింగో ఫుట్‌బాల్ క్లబ్‌లో ఈ దారుణం జరిగింది. క్లబ్‌లోని డార్మిటరీలో క్రీడాకారులు నిద్రిస్తున్న వేళ మంటలు చెలరేగాయి. చుట్టుముట్టిన మంటల్లో చిక్కుకున్న చిన్నారులు తప్పించుకునే మార్గంలేక మంటలకు ఆహుతయ్యారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఫ్లెమింగో ఫుట్‌బాల్ క్లబ్‌కీ, మరో జట్టుకి మధ్య నేడు మ్యాచ్ జరగాల్సి ఉండగా అంతలోనే ఈ ఘటన జరగడంతో అందరూ షాక్‌కు గురయ్యారు. విషయం తెలిసిన గవర్నర్ విల్సన్ మూడు రోజులపాటు సంతాప దినాలు ప్రకటించారు.