యాత్ర సినిమా చూసి హనుమంతన్న ఒళ్ళు మండదా ?

వాస్తవం సినిమా: వైయస్ రాజశేఖర్ రెడ్డి చేపట్టిన పాదయాత్రను దృష్టిలో పెట్టుకుని తీసిన సినిమా యాత్ర. తాజాగా విడుదలైన ఈ సినిమా టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల సునామి సృష్టిస్తోంది. ముఖ్యంగా ఈ సినిమాలో వైయస్ పాత్రలో మమ్ముట్టి అద్భుతంగా నటించి కేవలం వైఎస్ ని మాత్రమే వెండితెరపై తన నటనలో చూపించారు అని అనటంలో ఎటువంటి సందేహం లేదు. సినిమాని చూసిన ప్రతి ఒక్కరు మరొకసారి వైఎస్ ని గుర్తు చేశారు అని కామెంట్లు చేస్తున్నారు. చాలామంది వై.యస్ చేపట్టిన పథకాల కు లబ్ధి పొందిన విద్యార్థులు మరియు ఆరోగ్యశ్రీ ద్వారా మేలు పొందిన కుటుంబాలు సినిమాని చూసి చాలా భావోద్వేగానికి గురై కంటతడి పెట్టుకుంటున్నారు.

అయితే ఇదే క్రమంలో వైఎస్ పై అసంతృప్తితో ఉన్న కొంతమంది కాంగ్రెస్ నేతలు కూడా సినిమాను చూసి చప్పట్లు కొడుతుంటే మరోపక్క కొంతమంది కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు సినిమాను చూసి లోలోపల విమర్శలు చేస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా ఈ సినిమాలో హైకమాండ్ వర్సెస్ వైఎస్ అన్నట్టుగా చూపించడంతో ఆ సమయంలో హైకమాండ్ నీ మంచిగా చేసుకోవడానికి వైఎస్ కి వ్యతిరేకంగా ఉన్నా వారి పాత్రలను కూడా ఈ సినిమాలో చూపించారు. ఈ క్రమంలో తోటపల్లి మధు వేసిన పాత్ర వేషధారణ బాష వ్యంగ్యంగా విసుర్లు వేసే తీరు అంతా సీనియర్ నేత విహెచ్ హనుమంతరావును గుర్తు చేసినట్టు ఉందని కామెంట్స్ వస్తున్నాయి. గతంలో అర్జున్ రెడ్డి పోస్టర్ల మీదున్న లిప్ లాక్ కిస్సుల మీద ఫైర్ అయిపోయి వాటిని చించేసి రచ్చ చేసిన విహెచ్ మీద విజయ్ దేవరకొండ చిల్ తాతయ్య అంటూ తన ఫేస్ బుక్ లో కామెంట్ పెట్టడం సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. మళ్ళి ఇప్పుడు యాత్రలో ఏకంగా ఆయన పాత్రనే చూపించడంతో విహెచ్ వొళ్ళు మండినట్లు కొంతమంది అంటున్నారు. అన్నట్టు ఈ పాత్ర వైఎస్ ఆర్ గురించి చెబుతూ ఏకవచనంలో వాడు వీడు అని చెప్పడాన్ని బట్టి చూస్తే ఇది ఆయన పాత్రే అని మీడియా వారు సైతం పోల్చుకుంటున్నారు. మొత్తంమీద వైఎస్ నీ అద్భుతంగా ‘యాత్ర’ సినిమా లో చూపించడంతో మరొకసారి అటువంటి ప్రభుత్వం అటువంటి నాయకుడు కావాలని తెలుగు రాష్ట్రాలు బాగుపడాలంటే ఇటువంటి రాజీ పడని నేత ఉండాలని సినిమాని చూసిన వారు కామెంట్లు చేస్తున్నారు.