యాత్ర దెబ్బకి ఎన్టీఆర్ రాకుండా ఉండడమే మంచిది అయ్యింది !

వాస్తవం సినిమా: తాజాగా విడుదలైన ‘యాత్ర’ సినిమా బాక్సాఫీస్ దగ్గర బీభత్సమైన కలెక్షన్ల సునామి సృష్టిస్తోంది. అయితే ఈ సినిమాతో పాటు విడుదల కావాల్సిన ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ మొదటి పార్ట్ ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ దెబ్బకి విడుదల కాకపోవడంతో మంచిదయింది అని అంటున్నారు సినిమా ఇండస్ట్రీకి చెందిన వారు. రాజకీయాలలో ఇద్దరు దిగ్గజ పర్సనాలిటీలు కలిగిన నేతల సినిమాలు ఒకేసారి రాకపోవడం మంచి జరిగిందని అని కూడా అంటున్నారు. ముఖ్యంగా తాజాగా విడుదలవ్వాల్సిన ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ విషయంలో డైరెక్టర్ క్రిష్ చాలా ఆలోచిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ సినిమాకి సంబందించిన షూటింగ్ ఇంకా జరుగుతూనే ఉంది. గతంలో ఫిబ్రవరిలో విడుదల చేస్తారని తెలియజేసిన సినిమా యూనిట్ ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ ఇచ్చిన స్ట్రోక్ కి ఎన్టీఆర్ మహానాయకుడు విషయంలో చాలా శ్రద్ధ తీసుకుంటున్నారు డైరెక్టర్ క్రిష్. అయితే ప్రస్తుతం యాత్ర సినిమా ప్రేక్షకుల హృదయాలను పార్టీలకతీతంగా రాజకీయాలు అతీతంగా ఆఖరికి తెలుగుదేశం పార్టీ నేతల కళ్ళల్లోనే నీళ్లు తెప్పించే విధంగా సినిమా ఉండటంతో ప్రస్తుతం ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ రాకపోవడం చాలా మంచిది అయిందని సినిమా విశ్లేషకులు పేర్కొంటున్నారు.