ఆంధ్ర, తెలంగాణా గ్రామీణ ప్రాంతాల్లో ఆప్త మహిళా సేవలు

వాస్తవం : అమెరికా లో ప్రముఖ తెలుగు NRI సంస్థ ఆప్త (అమెరికన్ ప్రోగ్రెసివ్ అసోసియేషన్ అఫ్ అమెరికా ) తెలుగు రాష్ట్రాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థినులకు ఆరు నెలలకు సరిపడా శానిటరీ నాప్ కేన్స్ ను పంపిణీ చేసింది.

గత కొన్ని సంవత్సరాలుగా ఆప్త సంస్థ AWEP (APTA WOMEN EMPOWERMENT PROGRAM) కార్యక్రమం లో భాగంగా శానిటరీ నాప్ కేన్స్ పంపిణీ చేస్తుంది .

ఈ కార్యక్రమంలో భాగంగా గత శుక్రవారం తెలంగాణా రాష్ట్రం లో మాస్కపూర్ గ్రామంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకొనే విద్యార్థినులకు శానిటరీ నాప్ కేన్స్ పంపిణీ కార్యక్రమం లో పాల్గొన్న స్థానిక MLA అజ్మీరా రేఖానాయక్ , ఆప్త సంస్థ పేద విద్యార్థినులకు చేస్తున్న ఈ చేస్తున్న ఈ సేవ అమోఘమైనదని , ఆప్త నాయకులకు , వాలంటీర్లను కొనియాడారు .

ఆంద్ర మరియు తెలంగాణా ప్రాంతాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఆప్త అధ్యక్షుడు శ్రీ నటరాజ్ యిల్లూరి, ఉపాధ్యక్షలు శ్రీమతి డా. నీరజ చవాకుల ఓ పత్రికా ప్రకటనలో తెలియ చేశారు .

ఈ సందర్భంగా వారు ఈ కార్యక్రమానికి తమ తోడ్పాటు అందించిన శ్రీ జనార్దన్ పన్నెల ప్రాంతీయ మహిళా విభాగం అధ్యక్షురాలు శ్రీమతి హిమ బిందు నరహరి శెట్టి లను ప్రత్యేకంగా అభినందిస్తూ , ఈ కార్యక్రమానికి కావలసిని ఆర్ధిక సహాయాన్ని అంద చేసిన ఆప్త మహిళా సభ్యులకు తమ హృదయ పూర్వక అభినందనలు తెలియ చేశారు.