ఎవరి విధులు వారు సమర్థంగా నిర్వర్తించడమే అసలైన దేశభక్తి : వెంకయ్యనాయుడు

వాస్తవం ప్రతినిధి: ఎవరి విధులు వారు సమర్థంగా నిర్వర్తించడమే అసలైన దేశభక్తి అని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని ఇఫ్లూ (ఆంగ్ల, విదేశీ భాషల విశ్వవిద్యాలయం)లో నిర్వహించిన వజ్రోత్సవాల్లో శనివారం ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా వజ్రోత్సవాల పైలాన్‌ను ఆవిష్కరించారు దేశానికి సుస్థిర అభివృద్ది అవసరమని, రైతుల ఆదాయాన్ని పెంచేందుకు ఎన్నో పరిశోధనలు జరగాల్సిన అవసరముందని ఉపరాహ్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. మహిళా సాధికారత, నిరుద్యోగం, విద్యపై లోతుగా చర్చించాల్సిన అవసరముందని పేర్కొన్నారు. వృద్ధి రేటు బాగుంటేనే దేశం బాగుంటుందన్నారు. జనం ఆరోగ్యంగా ఉంటేనే, దేశం సుసంప్నంగా ఉంటుందని వెంకయ్యనాయుడు చెప్పారు.