చంద్రబాబు కీలక నిర్ణయం..ప్రభుత్వ ఉద్యోగులకు 20 శాతం మధ్యంతర భృతి

వాస్తవం ప్రతినిధి: ఏపీ సీఎం చంద్రబాబునాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు 20 శాతం మధ్యంతర భృతి ఇచ్చేందుకు అంగీకరించారు. 40 నుంచి 45 శాతం వరకూ మధ్యంతర భృతి ఇవ్వాలని ఉద్యోగ సంఘాల నేతలు డిమాండ్‌ చేస్తుండగా.. 20 శాతం ఐఆర్‌ ఇచ్చేందుకు సీఎం అంగీకారం తెలిపారు. 20 శాతం మధ్యంతర భృతి నిర్ణయం వల్ల ప్రభుత్వ ఖజానాపై ఏడాదికి రూ.6,884 కోట్ల మేర భారం పడనుంది.