“వైసీపీ కి 130”, “టీడీపీ కి 30”… “వీడీపీ”…షాకింగ్ సర్వే..!!!

వాస్తవం ప్రతినిధి : ఏపీలో త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో గెలుపు వైసీపీ కి దక్కుతుందని, జగన్ తప్పకుండా సీఎం అవుతాడని ఎన్నో సర్వేలు ఇప్పటికే తమ రిపోర్ట్ లలో తెలిపాయి. ఎప్పటికప్పుడు వస్తున్న సర్వేలు సైతం ఇదే విషయాన్ని తేల్చి చెప్తున్నాయి. ప్రజా ఆమోదం అందుకోబోయే పార్టీ ఏదన్నా ఉందంటే అది కేవలం వైసీపీనే అంటున్నాయి. ఇదిలాఉంటే గతంలో హైదరాబాద్ గ్రేటర్ ఎన్నికల్లో , కర్ణాటక తమిళనాడు ఎన్నికల ఫలితాలను ఏ మాత్రం లెక్క తప్పకుండా వెల్లడించిన సర్వే గా “వీడీపీ –అసోసియేట్స్” కి మంచి గుర్తింపు ఉంది.

ఈ సర్వే లెక్కల ప్రకారం , ఏపీలో మొత్తం 25 లోక్ సభ స్థానాలలో వచ్చే ఎన్నికల్లో జగన్ మోహన్ రెడ్డి దాదాపు 20 స్థానాలని గెలుచుకుంటారని అంటున్నారు. అంతేకాదు 45 శాతం ఓటర్ యొక్క షేర్ తమ ఖాతాలోకి వేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయట. టీడీపీ 37.2 శాతం ఓట్లతో కేవలం నాలుగంటే నాలుగు సీట్లకు పరిమితం అవుతుందని తెలిపింది. జనసేన వచ్చే ఎన్నికలపై తీవ్ర ప్రభావం చూపుతుందని సర్వే అంచనా వేసింది. ఇక జనసేన పార్టీ  5.9 శాతం ఓట్లను పవన్ కల్యాణ్ పార్టీ సాధిస్తుందని ఈ సర్వే అభిప్రాయ పడింది..

ఇదిలాఉంటే టీడీపీ ,జనసేన ల మద్య కాపుల ఓట్లు చీలిక భారీగా ఉంటుందని, దాంతో వైసీపీ లాభపడే అవకాశం ఎక్కువగా ఉంటుందని ఈ సర్వే స్పష్టం చేసింది. ఇదిలాఉంటే కాంగ్రెస్ పార్టీ ఏపీలో 2.2 శాతం ఓట్లు తమ ఖాతాలో వేసుకుంటుందని, అయితే కాంగ్రెస్ కంటే బీజేపీ 7.13 శాతం ఓట్లనుపొందుతుందని అంచనా వేసింది.అయితే ఇదే ఎన్నికల సరళి అసెంబ్లీ సీట్ల విషయంలో కూడా జరిగితే టీడీపీ 30 సీట్లకి మాత్రమే పరిమితం అవుతుందని తెలిపింది..ఇక పొతే వైసీపీ కి మాత్రం 130 స్థానాలు పక్కా అని చెప్తోంది. మరి మారుతున్న రాజకీయ పరిణామాల దృష్ట్యా ఈ లెక్కలలో హెచ్చుతగ్గులు ఉండే అవకాశం ఉందని అంటున్నారు