రెండో టీ20లో టీమిండియా ఘనవిజయం  

వాస్తవం ప్రతినిధి: న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టీ20లో 7 వికెట్ల తేడాతో టీమిండియా విజయ దుందుభి మోగించింది.ఆతిథ్య జట్టు నిర్దేశించిన 159 పరుగుల లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించింది. కెప్టెన్ రోహిత్ శర్మ రెచ్చిపోవడంతో 159 పరుగుల లక్ష్యాన్ని మరో 7 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. రోహిత్ 29 బంతుల్లో 50 పరుగులు చేయగా.. పంత్ 40, ధవన్ 30, ధోనీ 20 పరుగులు చేశారు.

అంతకముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ 159 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. కృనాల్‌ పాండ్య మూడు వికెట్లు తీసి కివీస్‌ టాప్‌ ఆర్డర్‌ను కుదేలు చేశాడు. మిడిలార్డర్‌ బ్యాట్స్‌మెన్ క్రీజులో నిలదొక్కుకుని రాణించినా భారత బౌలర్ల ధాటికి నిలవలేకపోయారు. గ్రాండ్‌హోమ్‌(50), రాస్‌ టేలర్‌(42) బౌండరీల మోత మోగించి స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. ఇద్దరూ కలిసి 77పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. కృనాల్‌ పాండ్య మూడు వికెట్లు, ఖలీల్‌ అహ్మద్‌ రెండు, భువి, హార్దిక్‌ పాండ్య చెరో వికెట్ తీయడంతో కివీస్‌ నిర్ణీత 20ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 158 పరుగులు చేయగలిగింది.