ఐఎస్ఐఎస్ అంతమైంది: ట్రంప్

వాస్తవం ప్రతినిధి: ఐఎస్ఐఎస్(ఇస్లామిక్ ఉగ్రవాదం) అంతమైనట్లు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఇస్లామిక్ ఉగ్ర‌వాదుల ఆధీనంలో ఉన్న సిరియా, ఇరాక్‌లోని ప్రాంతాలు నూరు శాతం విముక్తి పొందాయని కాలిఫా ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ట్రంప్ తెలిపారు. అయితే అధికారికంగా దీనిపై ప్రకటన చేసేందుకు మరికొంత సమయం పడుతుంది అని వ‌చ్చే వారం ఈ విష‌యాన్ని అధికారికంగా వెల్ల‌డించ‌నున్న‌ట్లు ట్రంప్ తెలిపారు. కూట‌మి దేశాల‌తో జ‌రిగిన భేటీలో ట్రంప్ ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు. గ‌త రెండేళ్ల‌లో అమెరికా మిత్ర‌దేశాలు ఇస్లామిక్ ఉగ్ర‌వాదుల ఆధీనంలో ఉన్న సుమారు 20వేల చ‌ద‌ర‌పు మైళ్ల నేత‌ల‌ను స్వాధీనం చేసుకున్న‌ట్లు తెలిపారు.