బ్రేగ్జిట్ డీల్ లో మార్పుల కోసం బ్రసెల్స్ వెళ్లనున్న మే

వాస్తవం ప్రతినిధి: బ్రెగ్జిట్‌ డీల్‌లో మార్పుల కోసం బ్రిటిష్‌ ప్రధాని థెరిసా మే ఈరోజు(గురువారం)మళ్లీ బ్రసెల్స్‌ వెళ్లనున్నట్లు తెలుస్తుంది. యూరోపియన్‌ యూనియన్‌ నాయకులను కలుసుకుని ఐరిష్‌ సరిహద్దుల్లో ఏర్పాట్లకు సంబంధించి చట్టబద్ధమైన మార్పులను అంగీకరించి తీరాల్సిందేనని ఈ సందర్భంగా ఆమె కోరనున్నట్లు తెలుస్తుంది. జనవరి29న పార్లమెంటులో బ్రిటిష్‌ ప్రధాని థెరిసా మే ప్రవేశపెట్టిన బ్రెగ్జిట్‌ బి ప్లాన్‌కు అధికార ప్రతిపక్ష సభ్యులు తెచ్చిన సవరణ ప్రకారం ఐరిష్‌ బ్యాక్‌ స్టాప్‌ క్లాజ్‌ను తొలగించేలా ఇయును ఒప్పించాలి. లేదంటే ఎలాంటి డీల్‌ లేకుండా బ్రిటన్‌ ఇయు నుంచి నిష్క్రమించాల్సి న పరిస్థితి ఏర్పడుతుంది. లేదా పార్లమెంటును రద్దు చేసి తిరిగి తాజాగా ఎన్నికలకు వెళ్లడమో, రెండవ రిఫరెండమ్‌ను కోరడమో అనేది నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. ఇయు నుంచి బ్రిటన్‌ నిష్క్రమణకు గడువు (మార్చి 29) సమీపిస్తున్నా నవంబరులో కుదుర్చుకున్న డీల్‌లో ఏమైనా మార్పులు వుండేది లేనిది కూడా తేలలేదు.