ప్రపంచ బ్యాట్మింటన్ లో స్వర్ణం సాదిస్తా: సింధు

వాస్తవం ప్రతినిధి: ఈ ఏడాది ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పీవీ సింధు విశ్వాసం వ్యక్తం చేసింది. గత రెండు టోర్నీల్లో ఆమె రజతం తో సరిపెట్టుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సారి మాత్రం స్వర్ణం సాదిస్తానని సింధు విస్వాశం వ్యక్తం చేసారు. ‘‘గత రెండు ఛాంపియన్‌షిప్‌లలో రజతం గెలిచా. ఈసారి స్వర్ణం సాధిస్తాననే ఆశాభావంతో ఉన్నా. అది చాలా పెద్ద టోర్నమెంట్‌. ఎవరూ అంత తేలిగ్గా తలవంచరు. నేను నా అత్యుత్తమ ప్రదర్శన చేస్తా. అందరూ 2020 ఒలింపిక్స్‌కు సన్నద్ధమవుతున్నారు. చాలా మంది మంచి క్రీడాకారుణులు పోటీలో ఉన్నారు. టైటిల్‌ గెలవడం అంత తేలికేమీ కాదు’’ అని సింధు వ్యాఖ్యానించింది.a