క్రికెట్ లో మరో అద్భుతం…..పది పరుగులు…పది డకౌట్స్!

వాస్తవం ప్రతినిధి: ఇటీవల క్రికెట్లు ఎన్నో అద్భుతాలు నమోదు అవుతున్నాయి. అయితే ఎన్ని అధ్బుతాలు నమోదైనా క్రికెట్లో ఇలాంటి గణాంకాలు మాత్రం ఎప్పుడూ చూసివుండరు. ఎందుకంటే జట్టులో ఒక్కరు మాత్రమే ఖాతా తెరవగా,మిగతా పది మంది డకౌటయ్యారు.. ఆ ఒక్కరు చేసిన పరుగులు నాలుగు మాత్రమే. మిగతావన్నీ ఎక్స్‌ట్రా రన్స్. బుధవారం ఆస్ట్రేలియాలో జరిగిన ఓ స్థానిక మ్యాచ్‌లో ఈ అద్బుతం చోటు చేసుకుంది. దేశవాళీ టోర్నీలో న్యూ సౌత్‌ వేల్స్‌తో మ్యాచ్‌లో దక్షిణ ఆస్ట్రేలియా మహిళల జట్టు ఈ అరుదైన చెత్త రికార్డును ఖాతాలో వేసుకుంది. న్యూసౌత్‌ వేల్స్‌ బౌలర్‌ రాక్సాన్నె వాన్‌ వీన్‌ ఒక్క పరుగు మాత్రమే ఇచ్చి ఐదు వికెట్లను పడగొట్టింది. నవోమి వుడ్స్‌ వేసిన రెండు బంతుల్లో వికెట్లు తీసుకుంది. పది మంది ఖాతానే తెరవకున్నా.. దక్షిణ ఆస్ట్రేలియా జట్టు 10.2 ఓవర్లు ఆడటం విశేషం. ఆ జట్టులో మాన్సెల్‌ 33 బంతులు ఎదుర్కొని 4 పరుగులు చేసింది. ఆ తర్వాత న్యూసౌత్‌వేల్స్‌ 2 వికెట్లు కోల్పోయి 15 బంతుల్లో లక్ష్యాన్ని అందుకుంది.