ఎన్టీఆర్ బయోపిక్ చూసి జాగ్రత్త పడుతున్న యాత్ర సినిమా యూనిట్..!

వాస్తవం సినిమా: ప్రస్తుతం దేశం మొత్తం బయోపిక్ల పర్వం కొనసాగుతోంది. ఈ క్రమంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా బయోపిక్ ల ట్రెండ్ ఊపందుకుంది, మహానటి సినిమాతో మొదలైన బయోపిక్ ల సందడి ఎన్టీఆర్, వైఎస్సాఆర్ బయోపిక్ లతో మరింత పెరిగింది. ఇటీవల సంక్రాంతి సందర్బంగా ఎన్టీఆర్ బయోపిక్ లోని మొదటి భాగం “ఎన్టీఆర్ కథానాయకుడు” విడుదలైంది. సినిమాకు మంచి టాక్ వచ్చినప్పటికీ వసూళ్ల పరంగా బాగా వెనకబడింది ఎన్టీఆర్ కథానాయకుడు, అందుకు కారణం సినిమాలో కేవలం ఎన్టీఆర్ నట జీవితం మీద దృష్టి పెట్టడం అందులో సినిమాకు కావాల్సిన ఎమోషన్ లేకపోవటం అని కొంతమంది అంటున్నారు. మరి కొంత మంది మాత్రం సినిమా నిడివి కారణం అని అంటున్నారు, ఎన్టీఆర్ కథానాయకుడు 2గంటల 56నిమిషాలు ఉండటంతో ప్రేక్షకుడు కాసింత విసుగు చెందాడు. అయితే బయోపిక్ అన్నాక ఆ మాత్రం లెంగ్త్ ఉండటం సహజం. మరి కొన్ని రోజుల్లో విడుదల కానున్న యాత్ర టీమ్ ఎన్టీఆర్ కథానాయకుడు సినిమాలో జరిగిన తప్పులను చూసి జాగ్రత్త పడుతున్నట్టు కనిపిస్తుంది ముఖ్యంగా సినిమా లెంగ్త్ విషయంలో, యాత్ర కేవలం 126 నిమిషాల లెంగ్త్ లోనే ఉంటుందట. ఫిబ్రవరి 8న ఈ సినిమా తెలుగు తమిళ్ లో విడుదల కానుంది, ఈ సినిమాలో వివాదాస్పద అంశాలేవీ లేవని ఈ సినిమా డైరెక్టర్ ఇప్పటికే చెప్పేసాడు, దీంతో సినిమా డాక్యుమెంటరీ లాగా ఉండబోతోందని విమర్శలు వస్తున్నాయి. సినిమా కచ్చితంగా హిట్ అవుతుందని సినిమా యూనిట్ కాన్ఫిడెంట్ గా ఉన్న నేపథ్యంలో ప్రేక్షకులు దీన్ని ఎలా ఆదరిస్తారో చూడాలి.