పవన్ కోరితే జనసేన పార్టీకి ప్రచారం చేసేందుకు సిద్దం: అలీ

వాస్తవం ప్రతినిధి: హాస్య నటుడు అలీ ని పక్కన పెట్టుకుని కామెడీ చేయడం అంటే పవన్ కు ఎంతో ఇష్టం. అందుకే చాలా వరకు పవన్ సినిమాల్లో అలీ హాస్యనటుడుగా ఉనారు. ఇక, అలీ రాజకీయాల్లోకి వచ్చి, ప్రజా సేవ చేయాలని నిర్ణయం తీసుకున్న తరువాత, అన్ని రాజకీయ పార్టీల అధినేతలనూ కలిశారన్న సంగతి తెలిసిందే. పవన్ కల్యాణ్, చంద్రబాబు, జగన్ తదితరులతో అలీ భేటీ అయ్యారు. తాజాగా, తన రాజకీయ రంగ ప్రవేశంపై ప్రముఖ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యులో అలీ మాట్లాడుతూ .తాను జనసేన పార్టీలో చేరబోవడం లేదని, ఏ పార్టీలో చేరుతానో అతి త్వరలో చెబుతానని అన్నారు. సినిమా వేరు, స్నేహం వేరు, పార్టీ వేరు అని వ్యాఖ్యానించిన అలీ, తనను ఎన్నడూ పవన్ కల్యాణ్ జనసేన పార్టీలో చేరాలని కోరలేదని స్పష్టం చేశారు. తాను తెలుగుదేశం అభిమానినన్న విషయం పవన్ కు తెలుసునని చెప్పారు. పవన్ కోరితే జనసేన పార్టీకి ప్రచారం చేసేందుకు సిద్ధమని అన్నారు. ప్రజలకు సేవ చేయాలన్న తలంపుతోనే మంత్రిగా బాధ్యతలు చేపట్టాలని భావించానని, ఆ మేరకు కోరుకోవడంలో తప్పేంటని ప్రశ్నించారు