కివీస్ బౌలర్ల ధాటికి విలవిల్లాడిన టీమిండియా బ్యాట్స్ మెన్స్….139 పరుగులకే ఆలౌట్

వాస్తవం ప్రతినిధి: కివీస్ బౌలర్ల ధాటికి టీమిండియా బ్యాట్స్ మెన్ లు విలవిల్లాడారు. దీనితో న్యూజిలాండ్‌ నిర్దేశించిన 220 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో టీమిండియా ఘోరంగా విఫలమైంది. ఎంఎస్ ధోనీ (39; 31 బంతుల్లో 5×4, 1×6), శిఖర్‌ ధావన్‌ (29; 18 బంతుల్లో 2×4, 3×6), విజయ్‌ శంకర్‌ (27; 18 బంతుల్లో 2×4, 2×6) మినహా మరెవ్వరూ రాణించలేకపోవడం తో టీమిండియా 80 పరుగుల తేడా తో ఓటమి పాలైంది. అయితే కృనాల్‌ పాండ్య (20; 18 బంతుల్లో 1×4, 1×6) కూడా కాస్త ఫర్వాలేదనిపించాడు. మొత్తానికి భారత్‌ 139 పరుగులకే ఆలౌట్ అవ్వడం తో కివీస్ జట్టు తోలి టీ-20 లో విజయాన్ని అందుకుంది.