తడబడుతున్న టీమిండియా బ్యాట్స్ మెన్స్

వాస్తవం ప్రతినిధి: న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టీ20లో టీమిండియా బ్యాట్స్‌మెన్‌ లు తడబడుతున్నారు. తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ జట్టు నిర్ణీత 20 ఓవర్ల లో 220 పరుగుల భారీ లక్ష్యాన్ని అందించిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో టీమిండియా బ్యాటింగ్ కు దిగగా ఆదిలోనే తడబడింది. 18పరుగులకే తొలి వికెట్‌ చేజార్చు పర్యాటక జట్టు తాజాగా మరో ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ వికెట్‌ను కూడా కోల్పోయింది. ధావన్‌ 29 పరుగుల వ్యక్తిగత స్కోర్‌ వద్ద పెవిలియన్‌ చేరాడు. మూడు సిక్స్‌లు, రెండు ఫోర్లతో మెరుపులు మెరిపించిన ధావన్‌ ఆరో ఓవర్లో ఫెర్గూసన్‌ బౌలింగ్‌లో బౌల్డ్‌ అయ్యాడు. ప్రస్తుతం క్రీజులో రిషబ్‌ పంత్‌(0), విజయ్‌ శంకర్‌(18) ఉన్నట్లు తెలుస్తుంది. 6 ఓవర్లు ముగిసే సమయానికి టీమిండియా 2 వికెట్లు కోల్పోయి 53 పరుగులు చేసింది.