చారిత్రాత్మక పర్యటన కోసం దుబాయ్ లో అడుగుపెట్టిన పోప్

వాస్తవం ప్రతినిధి: క్రైస్తవ మత గురువు పోప్ ఫ్రాన్సిస్ చారిత్రాత్మక పర్యటన కోసం దుబాయ్ లో అడుగుపెట్టారు. ఆదివారం రాత్రి దుబాయ్ చేరుకున్న పోప్ కు దుబాయ్ మిలటరీ పెరేడ్ తో అధికారులు ఆహ్వానం పలికారు. దీనితో దీంతో దుబాయ్‌లో పర్యటించిన తొలి పోప్‌గా పోప్‌ ఫ్రాన్సిస్‌కు చరిత్రకెక్కారు. పోప్‌ బసచేసిన అబుదాబీ అధ్యక్ష భవనం వద్ద అధికారులు గౌరవ సూచకంగా గాలులోకి కాల్పులు జరిపారు. దుబాయ్‌లో జరగనున్న ఇంటర్‌ఫెయిత్‌ కాన్ఫరెన్స్‌కు హాజరుకావాలన్న అబుదాబీ యువరాజు షేక్‌ మహ్మద్‌ బిన్‌ జయేద్‌ ఆహ్వానం మేరకు పోప్‌ యూఏఈలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ‘సోదరుడిగా.. యూఏఈతో కలసి పనిచేసేందుకు, శాంతి మార్గంలో పయనించేందుకు ఇక్కడకు వచ్చాను’ అని ఈ సందర్భంగా పోప్‌ అన్నారు. దీనిలో భాగంగా పోప్‌తో సోమవారం జరిగిన భేటీపై యూఏఈ ప్రిన్స్‌ స్పందిస్తూ.. ‘పోప్‌ను కలవడం చాలా సంతోషాన్ని కలిగించింది. సమావేశంలో భాగంగా పరస్పర సహకార మెరుగుదల, సహనశీలత, ప్రజలు, సమాజం కోసం శాంతి, స్థిరత్వం, అభివృద్ధి సాధించడానికి చేయాల్సిన ముఖ్యమైన విషయాలపై చర్చించాం’అని ప్రిన్స్‌ ట్వీట్‌ చేశారు.