పంత్ ఉండాలనే చెబుతా: గవాస్కర్

వాస్తవం ప్రతినిధి: టీమిండియా యువ వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మన్‌ రిషభ్ పంత్‌ను ఆస్ట్రేలియా తో జరిగిన టెస్ట్ సిరీస్ లో రెచ్చిపోయిన సంగతి తెలిసిందే. అయితే తన కెరీర్ లో మూడు వన్డేలు ఆడిన పంత్ పెద్దగా రాణించలేక పోయాడు. దీనితో న్యూజిలాండ్ తో వన్డే,టీ20 సిరీస్ లలో బీసీసీఐ సెలక్టర్లు పంత్ కు అవకాశం ఇవ్వలేదు. ఆసీస్ తో జరిగిన టెస్ట్ ల తరువాత అతడికి విశ్రాంతి ఇచ్చారు. అయితే పంత్ ఉండాలనే చెబుతా అని మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అన్నారు. టాప్‌ ఆర్డర్‌లో అతడి ఎడమచేతి వాటం జట్టుకు ప్రయోజనం చేకూరుస్తుంది. ఉపఖండంలో ఆస్ట్రేలియాతో జరిగే ఐదు వన్డేల సిరీస్‌లో అతడిని ఎంపిక చేయాలి. పంత్‌ను 4, 5 స్థానాల్లో బ్యాటింగ్‌కు దింపి అదనపు బాధ్యతలు అప్పగిస్తే ఎలా ఆడుతున్నాడో తెలుస్తుంది. 6, 7 స్థానాల్లో ఆడిస్తే అతడు భారీ షాట్లకే మొగ్గుచూపుతాడు. అదికాదుగా మనకు కావాల్సింది’ అని సునిల్‌ గవాస్కర్‌ వ్యాఖ్యానించారు.