మీడియా తో మాట్లాడకుండా పారిపోయిన ధోనీ

వాస్తవం ప్రతినిధి: టీమిండియా మాజీ సారధి ఎం ఎస్ ధోనీ మీడియా తో మాట్లాడకుండా పారిపోయారు. ధోనీ ఇప్పటి వరకు కొన్ని వందల సార్లు మీడియాతో మాట్లాడి ఉంటాడు. విలేకరులు వేసే కఠిన ప్రశ్నలకు సమయస్ఫూర్తితో జవాబులు ఇచ్చేందుకు అస్సలు ఇబ్బంది పడడు అలాంటిది ఆయన మీడియా తో మాట్లాడకుండా పారిపోవడం ఏంటి అని అనుకుంటున్నారా. న్యూజిలాండ్‌పై ఐదో వన్డే గెలిచిన తర్వాత ‘చాహల్‌ టీవీ’తో మాట్లాడేందుకు ధోనీ ఇష్టపడలేదు. మళ్లీ కన్ఫ్యూజ్ అయ్యారా ఈ మధ్య చాహల్’ చాహల్ టీవీ’ పేరుతో ఒక చాట్ షో ప్రారంభించాడు. ఈ షో ద్వారా టీమిండియా ఆటగాళ్లను ఇంటర్వ్యూ చేస్తున్నాడు. అయితే ఇవన్నీ సరదా ముచ్చట్లే అనుకోండి. ఇందులో భాగంగానే కివీస్‌పై 4-1తో సిరీస్‌ కైవసం చేసుకున్న తర్వాత మహీని ఇంటర్య్వూ చేయాలని చాహల్‌ అనుకున్నాడు. అయితే చాహల్ టీవీ మీడియా తో మాట్లాడడానికి ధోనీ ఇష్టపడలేదట. దీనితో చాహల్‌ అతడిని బలవంతం చేయబోయినప్పటికీ ఇష్టం లేదో మరి సరదాకో తెలియదు గానీ యూజీ వెంటపడుతున్నా మహీ మైదానంలో పరుగెత్తుకుంటూ పెవిలియన్‌కు వెళ్లిపోయాడు. ఇదంతా వీడియోలో రికార్డు అవ్వడం గమనార్హం. ఈ వీడియో ఇంటర్నెట్లో సంచలనంగా మారింది.