ఆస‌క్తిగా మారిన కోడెల రాజ‌కీయం..!!!

వాస్తవం ప్రతినిధి:  ఏపీ అసెంబ్లీ స్పీక‌ర్‌సీనియ‌ర్ రాజ‌కీయ యోధుడు గుంటూరుకు చెందిన కోడెల శివ‌ప్ర‌సాద‌రావు డిబేట్ ఆఫ్‌ది పాలిటిక్స్ గా మారారు. ప్ర‌స్తుతం ఆయ‌న స‌త్తెనప‌ల్లి నుంచి ప్రాతినిధ్యం వ‌హిస్తున్న విష‌యం తెలిసిందే. అయితేఆయ‌న గ‌తంలో ప్రాతినిధ్యం వ‌హించిన రాజ‌కీయంగా ఎదిగిన న‌ర‌స‌రావుపేట‌పై మాత్రం ఆయ‌న మ‌న‌సు పోవ‌డం లేదు. మ‌నిషిగా ఆయ‌న స‌త్తెన‌పల్లిలోనే ఉంటున్నా.. మ‌న‌సు మాత్రం పూర్తిగా న‌ర‌స‌రావుపేటలోనే ఉంటోంది. ప్ర‌భుత్వం ప‌రంగా ఆయ‌న ఏ కార్య‌క్ర‌మం త‌ల‌పెట్టినా ఈ నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోనే చేప‌డుతున్నారు. ఇటీవ‌ల ఇక్క‌డి ప్ర‌ముఖ దేవాల‌యం కోట‌ప్ప‌కొండ కేంద్రంగా ఆయ‌న కొండ‌పండుగ‌ను ఘ‌నంగా నిర్వ‌హించారు. దీనికి సంబందించి కోటి రూపాయ‌ల‌ను ప్ర‌భుత్వం కూడా కేటాయించింది.

మొత్తం రెండు రోజులు నిర్వ‌హించిన ఈ కార్య‌క్ర‌మం ల‌క్ష్యం పూర్తిగా రాజ‌కీయం. అనేక మంది మంత్రుల‌ను ఆయ‌న ఇక్క‌డ ఆహ్వానించి రాజ‌కీయ బ‌ల‌ప్ర‌ద‌ర్శ‌న‌కు వేదిక‌గా వాడుకున్నార‌నేది నిర్వివాదాంశం. వాస్త‌వానికి న‌ర‌స‌రావుపేట నుంచి వైసీపీ నాయ‌కుడు డాక్ట‌ర్ గోపిరెడ్డి శ్రీనివాస‌రెడ్డి విజ‌యం సాధించారు. అయితేఈ ఐదేళ్ల‌లో ప్ర‌భుత్వం ఆయ‌న‌కు ఇవ్వ‌వ‌ల‌సిన అభివృద్ధి నిధుల‌ను కోడెల సూచించిన వారికి కేటాయించింద‌నే విమ‌ర్శ‌లు ఉన్నాయి. గ‌తంలో అసెంబ్లీ స‌మావేశాల‌కు హాజ‌రైన నేప‌థ్యంలో స‌భావేదికగా గోపిరెడ్డిఈ విష‌యాన్ని ప‌లుమార్లు ప్ర‌శ్నించారు. జ‌న్మ‌భూమి క‌మిటీల‌కు నిధులు కేటాయించ‌డంస్పీక‌ర్ జోక్యం వంటి వాటిని ఆయ‌న‌నిల‌దీశారు. అయినా కూడా ప్ర‌భుత్వం త‌న తీరును మార్చుకోలేదు. ఇక‌తొలుత అడ‌పా ద‌డ‌పా గ‌తంలో ఇక్క‌డ పర్య‌టించిన కోడెల‌.. ఇటీవ‌ల కాలంలో త‌ర‌చుగా ఇక్క‌డే మ‌కాం వేస్తున్నారు.

ఇక్క‌డ జ‌రిగిన అభివృద్ధిపై చ‌ర్చ‌కు సిద్ధ‌మ‌ని కూడా ఎమ్మెల్యే వ‌ర్సెస్ స్పీక‌ర్‌కు మ‌ధ్య రాజ‌కీయ యుద్ధం కూడా జ‌రిగింది. క‌ట్ చేస్తే.. ఇప్పుడు ఎన్నిక‌లు వ‌స్తున్న నేప‌థ్యంలో కోడెల మ‌రింత వేగం పెంచారు. ఈ నియోజ‌క‌వ‌ర్గం త‌న ప‌ట్టును నిలుపుకొనేందుకు ప‌క్కా వ్యూహంతో ముందుకు సాగుతున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌న కుమారుడికి ఈ టికెట్ ఇప్పించుకోవాల‌ని కోడెల ప్ర‌య‌త్నిస్తున్నారు. అయితేఇక్క‌డ కోడెల కుమారుడిపై తీవ్ర అవినీతి ఆరోప‌ణలు ఉండ‌డంతో ఈయ‌న‌కు ఇచ్చే విష‌యంలో సందేహాలు నెల‌కొన్నాయి. కానీకోడెల మాత్రం గ‌ట్టిగా ఈ టికెట్‌ను త‌న‌కుమారుడికే కేటాయించాల‌ని కోరుతున్నారు. అదేవిధంగా త‌న‌కు స‌త్తెన ప‌ల్లిని ఇవ్వాల‌ని ఆయ‌న అడుగుతున్న‌ట్టు తెలుస్తోంది. కుదిరితే.. త‌న కుమార్తె డాక్ట‌ర్ విజ‌యల‌క్ష్మికి కూడా టికెట్ ఇప్పించుకునేందుకు ఆయ‌న పావులు క‌దుపుతున్నారు.

కోడెల కుమారుడు శివ‌రామ‌కృష్ణ‌కు మాచ‌ర్ల టికెట్ ఇచ్చే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తుండ‌డంతో న‌ర‌స‌రావు పేట‌ను త‌న కుమార్తెకు ఇవ్వాల‌ని ప‌ట్టుబ‌డుతున్న‌ట్టు తెలుస్తోంది. అయితేఇదే టికెట్‌ను త‌న కుమారుడికి కేటాయించాల‌ని మ‌రోప‌క్క న‌ర‌స‌రావు పేట ఎంపీ రాయ‌పాటి సాంబ‌శివ‌రావు కూడా పంతం ప‌డుతున్నారు. ఈ నేప‌థ్యంలో కోడెల రాజ‌కీయం గ‌రంగరంగా మారింది. తాను 35 ఏళ్ల‌కు పైగా టీడీపీని న‌మ్ముకుని ఉన్నాన‌ని,స్పీక‌ర్ ప‌ద‌వి కోసం మంత్రి ప‌ద‌విని సైతం త్యాగం చేశాన‌నినాకు ఇప్పుడు ఎందుకు న్యాయం చేయ‌ర‌ని ఆయ‌న త‌న అనుచ‌రుల వ‌ద్ద చెబుతున్న‌ట్టు గుంటూరులో గ‌ట్టి వ్యాఖ్య‌లే వినిపిస్తున్నాయి. మ‌రి ఈ నేప‌థ్యంలో కోడెల‌ను చంద్ర‌బాబు ఎలా బుజ్జ‌గిస్తారో చూడాలి.