ఆ రెండు పార్టీల మ‌ధ్య వైసీపీ న‌లుగుతోందా..?!

వాస్తవం ప్రతినిధి:  ఎన్నిక‌లు స‌మీపిస్తున్న నేప‌థ్యంలో రాష్ట్రంలో రాజ‌కీయాలు వేడెక్కాయి. ప్ర‌ధాన పార్టీలు టీడీపీవైసీపీ. జ‌న‌సేనలు వ్యూహాత్మ‌క రాజ‌కీయాల‌కు తెర‌దీశాయి. ఎవ‌రి దారి వారిదే అయినా.. ఒక‌రిపై మ‌రొక‌రు పైచేయి సాధించేందుకు ఎంతోశ్ర‌మిస్తున్న ప‌రిస్థితి క‌నిపిస్తోంది. అధికార పార్టీ ఎట్టిప‌రిస్థితిలోనూ తిరిగి అధికారంలోకి వ‌చ్చేందుకు ఉన్న అన్ని మార్గాల‌నూ వినియోగించుకుంటోంది. అదేస‌మ‌యంలో ఈ పార్టీని అధికారంలోకి రాకుండా చేసేలా వైసీపీ ప్ర‌య‌త్నాలు చేస్తోంది. అయితేనిన్న మొన్న‌టి వ‌ర‌కు కూడా అధికార పార్టీపై నిప్పులు చెరిగి.. ఇక‌త‌న‌కు ఎదురు లేద‌ని, సీఎం త‌ను కావ‌డం ఖ‌చ్చిత‌మ‌ని ప్ర‌చారం చేశారు. అయితేఇప్పుడు మాత్రం మ‌ధ్యేమార్గంగా ముందుకుసాగుతున్నారు. పైన చెప్పుకొన్న విధంగా ప‌వన్ వ్యూహం ప‌వ‌న్‌కు ఉంద‌నేది ఈ పార్టీ వారి మాట‌. ఇక‌నిన్న మొన్న‌టి వ‌ర‌కు అభివృద్ధి నినాదంతో ముందుకు సాగిన చంద్ర‌బాబు ఇప్పుడు వ‌రాల వ‌ర్షాన్ని న‌మ్ముకున్నారు.

కీల‌క‌మైన వ‌రాల‌ను ఎన్నికల ముందు ప్ర‌జ‌ల‌పై కురిపిస్తున్నారు. బీసీలకు మ‌రింత ఎక్కువ‌గా వ‌రాలు కురిపిస్తున్నారు. కేంద్రం ప్ర‌వేశ పెట్టిన ఆర్థికంగా వెనుక‌బ‌డిన వ‌ర్గాల‌కు 10% రిజ‌ర్వేష‌న్‌ను కూడా త‌న‌కు అనుకూలంగా మార్చుకుని కాపులను మ‌చ్చిక చేసుకునేందుకు వారికి ఇందులోనే 5%ప్ర‌క‌టించారు చంద్ర‌బాబు.  నిజానికి ఈ ప్ర‌తిపాద‌న వ‌చ్చిన‌ప్పుడు తీవ్ర‌స్థాయిలో బీజేపీపై విరుచుకుప‌డిన చంద్ర‌బాబు అనంత‌రం.. దీనిని త‌న‌కు అనుకూలంగా మార్చుకుని రాజ‌కీయ చ‌క్రాన్ని తిప్పేశారు. ఫ‌లితంగా ఇప్పుడు కాపుల‌ను ఆయ‌న త‌న‌వైపు తిప్పుకొనే ప్ర‌య‌త్నంలో స‌క్సెస్ అయ్యార‌ని అంటున్నారు టీడీపీ నేత‌లు. ఇక‌ప‌వ‌న్ వ్య‌వ‌హారం మ‌రింత ముదిరిన‌ట్టే క‌నిపిస్తోంది. ఆయ‌న వైఖ‌రి స్ప‌ష్టంగా తెర‌మీదికి వ‌చ్చింది. తాను పూర్తిగా ఒంట‌రి పోరు చేస్తాన‌ని చెప్పుకొన్నా.. ఇప్పుడు ఆయ‌న వేస్తున్న అడుగుల‌తో ఆయ‌న స‌గం క‌న్నా కొద్దిగా ఎక్కువ సీట్ల‌తో త‌ప్ప పోటీ చేసే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు.

ఈ మొత్తం వ్య‌వ‌హారంలో వైసీపీ ప‌రిస్థితిని చూస్తే.. కొంత మేర‌కు న‌ష్ట‌పోయే ప‌రిస్తితి స్ప‌ష్టంగా క‌నిపిస్తోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. నిన్న మొన్న‌టి వ‌ర‌కు జ‌గ‌న్ పాద‌యాత్ర‌తో వ‌చ్చిన ల‌బ్ధి మొత్తం ఇప్పుడు చంద్ర‌బాబు చేస్తున్న ప్ర‌చారంతో ప్ర‌భావంలో ప‌డింద‌ని అంటున్నారు. అదేస‌మ‌యంలో ప్ర‌తిష్టాత్మ‌కంగా ప్ర‌వేశ పెట్టిన జ‌గ‌న్ ప‌థ‌కాల‌పైనా ఇది ప్ర‌భావం చూపుతోంది. జ‌గ‌న్ ప్ర‌వేశ‌పెడ‌తాన‌ని 2017లోనే ప్ర‌క‌టించిన న‌వ‌ర‌త్నాల‌ను ఇప్పుడు య‌థాత‌థంగా చంద్ర‌బాబు కాపీ కొట్టార‌ని అంటున్న వైసీపీ నేత‌ల వ్యాఖ్య‌ల్లో నిజం ఉన్నా.. ఈ విష‌యాన్ని స‌మ‌ర్ధ‌వం తంగా వైసీపీ నేత‌లు ప్ర‌జ‌ల్లోకి తీసుకు వెళ్ల‌లేక‌పోగా.. బాబు వ్యూహాల‌కు అడ్డుక‌ట్ట కూడా వేయ‌లేక పోతున్నారు. మ‌రోప‌క్క చంద్ర‌బాబు నిన్న మొన్న‌టి వ‌ర‌కు తెలంగాణా సీఎం కేసీఆర్‌తో దోస్తీ చేస్తాన‌ని చెప్పిన మాట అంద‌రికీ తెలిసిందే. మీరు వ‌ద్ద‌న్నారు కాబ‌ట్టి  మేం కాంగ్రెస్ తో జ‌ట్టుక‌ట్టాం అంటూ తెలంగాణ ఎన్నిక‌ల స‌మ‌యంలో మ‌హాకూట‌మిని స‌మ‌ర్ధించుకున్నారు చంద్ర‌బాబు.

అయితేఅప్ప‌ట్లో కేసీఆర్ తో దోస్తీకి సిద్ధ‌మైన ఆయ‌న ఇప్పుడు మాత్రం జ‌గ‌న్ మాట్లాడితేనే త‌ట్టుకోలేని ప‌రిస్థితిలో ఉన్నారు. ఏపీకి ద్రోహం చేశారంటూ కేసీఆర్‌పై దూష‌ణ‌లు ప్రారంభించారు. ఇలా మొత్తంగా చూసుకుంటే.. రెండు ప్ర‌ధాన ప‌క్షాల్లో వైసీపీ ఇరుకున ప‌డుతున్న‌ట్టు క‌నిపిస్తోంది. మ‌రి దీనిని త‌మ‌కు అనుకూలంగా మార్చుకునేందుకు జ‌గ‌న్ ఏంచేస్తార‌నేది చూడాలి.