గతంలో లేనంతగా ప్రజాస్వామ్యం పై దాడి జరుగుతోంది: కమలా హ్యారిస్

వాస్తవం ప్రతినిధి: అమెరికాలో గతంలోలేనంతగా ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతోందని అధ్యక్ష అభ్యర్థిత్వ రేసులో నిలిచిన భారత సంతతి మహిళ కమలా హ్యారిస్‌ వ్యాఖ్యానించారు. ఈ సారి జరగబోయే అధ్యక్ష ఎన్నికల్లో కమలా హ్యారిస్ పోటీ చేస్తున్నట్లు ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ఎన్నికల ప్రచారాన్ని ఆమె ఆదివారం ప్రారంభించారు. ట్రంప్‌ విధానాలపై ధ్వజమెత్తారు. దేశ ప్రజాస్వామ్యంపై తీవ్ర దాడి అనంతరం ఇప్పుడు మళ్లీ అమెరికా మార్పు ముంగిట్లోకి వెళ్తోందనీ, ఆ మార్పును ప్రజలు స్వాగతించాలని విజ్ఞప్తి చేశారు. ‘స్వేచ్ఛా పాత్రికేయంపై దాడి, ఎగతాళి చేసే నాయకులు మనకు ఉన్నప్పుడు, మన ప్రజాస్వామ్య వ్యవస్థలను వారు నీరుగారుస్తున్నప్పడు.. అది మన అమెరికా కాదు’ అంటూ ట్రంప్‌నుద్దేశించి ఆమె వ్యాఖ్యలు చేశారు.