అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ (ఆప్త) నూతన అధ్యక్షుడిగా నటరాజు యిల్లూరి

వాస్తవం ప్రతినిధి: అమెరికాలో వేగంగా అభివృద్ధి చెందుతున్న తెలుగు సంస్థ ఆప్త (అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ ).  తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఏటా అనేక మంది పేద విద్యార్హులను చదివించే ఓ అధ్భుత సేవా కార్యక్రమం ద్వారా తెలుగు వారిలో అన్ని వర్గాల్లోనూ మంచి ప్రాచుర్యం పొందిన ఈ  తెలుగు సంఘం, అనేక ఇతర సేవా కార్యక్రమాలతో అమెరికాలోని అగ్ర తెలుగు సంఘాల్లో ఒకటిగా నిలుస్తుంది.

అయితే ఇటీవల జరిగిన ఆప్త 2019-2020 నూతన కార్యవర్గం ఎన్నికల్లో ఆప్త అధ్యక్షుడిగా నటరాజు యిల్లూరి ఎన్నికయ్యారు.

ప్రతి   రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ ఎన్నికల్లో రోడ్ ఐలాండ్ రాష్ట్ర వాసులు, ఫైనాన్సియల్ సర్వీసెస్ ఐటీ రంగములో అమెరికా లోని పేరెన్నిక కలిగిన బ్యాంకు లో సీనియర్ ఐటీ ఎగ్జిక్యూటివ్ రోల్ లో పని చేస్తున్న శ్రీ నటరాజు యిల్లూరి మరియు అతని జట్టు సంపూర్ణ విజయాన్ని సాధించారు. ఈ సందర్భంగా , పాత నాయకత్వం నుండి కొత్త నాయకత్వం సంస్థ బాధ్యతలను స్వీకరించే ప్రక్రియ లో భాగంగా  వీరి  జట్టు గత వారాంతం  బోస్టన్ నగరం లో “యూనిటీ మీట్ ” పేరుతొ ఓ చక్కటి  సమావేశాన్ని నిర్వహించారు.

అమెరికా లోని పలు రాష్ట్రాల నుండి ప్రత్యేక ఆహ్వానంతో దాదాపు గా 200 మంది ముఖ్య కార్యకర్తలు ఈ సమావేశానికి హాజరయ్యారు .

ఆప్త సంస్థ కు ఆర్ధికంగా అండదండగా నిలబడే వారిలో ప్రముఖులు శ్రీ కొటా సుబ్బు, నూతన నాయకత్వానికి తన శుభాకాంక్షలు తెలియచేస్తూ సభను ఆరంభించగా , ఆప్త వ్యవస్థాపకుల్లో ఒకరైన శ్రీ ప్రసాద్ సమ్మెట, మరియు శ్రీ శ్రీనివాస్ చిమట తన ప్రసంగంలో ఆప్త సాధించిన అభివృద్ధి ని క్లుప్తంగా తెలియచేసారు.

ఆప్త నూతన నాయకులు శ్రీ నటరాజు, సంస్థాగత ఎన్నికల సమయం లో సాధారణంగా వచ్చే వర్గ విభేదాలు సంస్థ అభివృద్ధి ని కుంటుపరుస్తున్నాయి అని , ఎన్నికల్లో పోటీ పేరుతొ సంఘ సభ్యుల మధ్య కలిగే అభిప్రాయ భేదాలను రూపుమాపటమే కాక , ఎన్నికల అనంతరం ఇరువర్గాల వారు కలిసి పనిచేసే  ఓ ఆధ్బుతమైన ప్రక్రియ కు శ్రీకారం చుట్టారు .

సంస్థ పరిపాలనా వ్యవహారాలు , సేవా కార్యక్రమాల్లో ఎన్నికల్లో గెలిచిన జట్టు మాత్రమే కాకుండా , ఎన్నికల్లో ఓడిన వారి ని   కూడా  భాగస్వాములను చేసే ఒక  అత్భుతమైన ఆలోచన తో ఇరు వర్గాలను ఈ సమావేశానికి ఆహ్వానించి, సంస్థ ను మరింత బలోపేతం చేయడానికి వారి నుండి సలహాలను , సూచనలను స్వీకరించారు. అంతే  కాకుండా వారిని అందరిని అదనపు కార్యవర్గ సభ్యులుగా (ఎక్స్ టెండెడ్ ఎక్సిక్యూటివ్ టీమ్)  బాధ్యతలను స్వీకరించ వలసిందిగా కోరి తెలుగు సంఘాల చరిత్ర లో  ఓ  నూతన అధ్యాయానికి తెరతీసారు.

ఈ సమావేశానికి హాజరైన  సంస్థ వ్యవస్థాపకులు, కార్యనిర్వహణ సభ్యులు , బోర్డు సభ్యులు , సంస్థ మాజీ నాయకత్వ సభ్యులు , ముఖ్య కార్యకర్తలు ఆప్త నూతన నాయకత్వపు ఆలోచనలు, వారి  భవిష్య కార్యాచరణ ల  పై  తమ హర్షాన్ని వెలిబుచ్చి , శ్రీ నటరాజ్ ఇల్లూరి కి తమ పూర్తి మద్దతు ను నిర్ద్వందంగా తెలియచేసారు.  పలువురు నీనియర్ వాలంటీర్లు సంస్థ అదనపు కార్యవర్గం (ఎక్స్ టెండెడ్ ఎక్సిక్యూటివ్ టీమ్ )  లో బాధ్యతలను స్వీకరించ డానికి ముందుకు వచ్చారు .

ఈ సందర్భంగా  శ్రీ నటరాజ్ మాట్లాడుతూ, గత కొన్ని సంవత్సరాలుగా అనేక కారణాలతో, మన స్పర్ధలతో సంస్థ ను వీడి వెళ్లిపోయిన వారు తన సోదర సమానులని, వారందరిని తిరిగి సంస్థ లోకి తీసుకు రావడం తన ప్రధాన కర్తవ్యాల లో అతి ముఖ్యమైనదిగా తెలియచేసారు.  సంఘ సభ్యుల మనోభావాలను గౌరవిస్తూ, ప్రతి కార్యకర్త ను కలుపుకు పోతూ  తానూ పని చేస్తానని,  అందరం కలిసి సమిష్టిగా  ఆప్త ను దేశంలోని అన్ని నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ లలో అగ్ర గామిగా నిలుపుదాం రమ్మని పిలుపునిచ్చారు.

వేదిక పై ఆప్త మాజీ నాయకులు శ్రీ గోపాల్ గూడపాటి, కొత్త నాయకత్వాన్ని అధికారికంగా ప్రకటించగా, నూతన  బోర్డు చైర్మన్ శ్రీ కిరణ్ పల్లా తన బోర్డు అఫ్ డైరెక్టర్లను, అధ్యక్షులు శ్రీ నటరాజ్ తన ఎక్జిక్యూటివ్ టీమ్ ను  సభ కు పరిచయం చేశారు.

ఈ సమావేశానికి కావలిసిన ఆర్ధిక అవసరాలను పూర్తిగా భరించి ఆప్త కు అన్ని విధాలుగా మద్దతు నిస్తున్న శ్రీ సుబ్బు కోట ను ఆప్త నూతన అధ్యక్షలు శ్రీ నటరాజ్ ప్రత్యకంగా సన్మానించి  తన కృతజ్ఞతలను తెలియ చేశారు . అలాగే ఈ సమావేశ నిర్వహణలో తమ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి తనకు ఎంతో సహాయ పడిన శ్రీ జనార్దన్ పైడా ను,  మిగిలినవారందరికీ    సభా ముఖంగా తన కృతజ్ఞతలను తెలియ చేశారు .

అయితే , ఈ సమావేశానికి హాజరైన అనేక మంది సీనియర్ సభ్యులు , గతంలో నాయకులు గా పని చేసిన అనేక మంది మాజీ నాయకులు కొత్త గా బాధ్యతలు స్వీకరించి , సరి కొత్త పంధాలో లో సంస్థ ను ముందుకు తీసుకు వెళదామని ప్రయత్నిస్తున్న శ్రీ నటరాజ్ ను అతని జట్టు ను  విశేషంగా అభినందించారు,  నటరాజ్ ఆలోచనా విధానం ఆప్త సంస్థకు కు కొత్త శక్తి ని ఇస్తుంది అని, తామందరం, మనస్ఫూర్తిగా ఆయనకు తమ మద్దతు తెలియ చేస్తామని వారిలో వారు సంభాషించు కోవడం కనిపించింది.

ఆప్త నూతన కార్యవర్గంలో కోర్ ఎగ్జిక్యూటివ్ సభ్యులుగా నటరాజు యిల్లూరి, తిప్పా బనారసీబాబు, ఎనుముల ఇన్నయ్య, శివ మొలబంటి, డా.నీరజా నాయుడు చవాకుల, శ్రీకాంత్ మన్నెం, లక్ష్మి చిమట , రావూరి సుభాషిణి, కోడె సురేష్, డా.గోపాల్ శిరసాని, తోట వీరా, మదన్ మోహన్ బోనేపల్లి ఎంపికయ్యారు. వీరితో పాటు బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ గా కిరణ్ పల్లా, అరుణ దాసరి, శ్రీధర్ నిశంకరరావు, రే దీప్తి నాయుడు, మహేష్ కర్రి, శ్రీధర్ వెన్నం రెడ్డి, గోన సురేష్, శ్రీనివాస్ సిద్దినేని, డా.సురేష్ అలహరి, దుర్గా ప్రసాద్ పెద్దిరెడ్డి ఎన్నికయ్యారు.

శ్రీ  నటరాజు ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఈ నాటి ఈ సమావేశం విజయవంత మవడానికి ఎంతో కృషి చేసిన కార్యకర్తలు శ్రీధర్ నిశంకరరావు, శ్రీనివాస్ సుంకర , బుల్లి కనకాల,  శేఖర్ నల్లం, నిరంజన్ కొప్పెర్ల, ఆదిత్య గాజుల, సతీష్ బండికల్లు, సురేష్ తాడిశెట్టి రవి యనుముల, రాజేంద్ర కొల్లిపర, హరి సింహాద్రి, లక్ష్మి సింహాద్రి, వెంకట్ పప్పాలా, శుభ రావూరి లతో పాటు,  చక్కని ఆడియో వీడియో లైటింగ్ సమకూర్చిన శ్రావియో ఏవి టీమ్ (Sraveo AV) కి తన హృదయ పూర్వక అభినందనలు తెలియచేశారు. .

ఈ సమావేశానికి ధరణి రెస్టౌరంట్స్ అధినేత  శ్రీ భాస్కర్ రెడ్నం గారు రుచికరమైన విందు భోజనాలు అందించగా ,  స్వగృహ ఫుడ్స్ న్యూ జెర్సీ ఓనర్ సాయిబాబు అనిశెట్టి గారు తెలుగింటి స్వీట్స్ రిటర్న్ గిఫ్ట్ గా అందించారు .