బుర్కినా ఫాసో లో ఉగ్రవాదుల దాడి….10 మంది మృతి!

వాస్తవం ప్రతినిధి: ఆఫ్రికా ఖండంలోని బుర్కినా ఫాసోలో ఉగ్రవాదులు దాడికి దిగినట్లు తెలుస్తుంది. అయితే ఈ ఘటనలో పది మందిని బలి తీసుకున్నారు. దేశ ఉత్తర ప్రాంతంలోని సికైర్‌ గ్రామంలో ఈ ఘటన జరిగింది. తుపాకులు చేతబట్టుకొని వచ్చిన ముష్కరులు గ్రామంలో విచ్చలవిడిగా కాల్పులు జరిపడం తో పాటు దుకాణాలను కూడా ధ్వంసం చేస్తూ, కొన్నింటిని తగులబెట్టారు. గ్రామస్థుల మోటారు బైకులను అపహరించుకొని వెళ్లారు. భయాందోళనకు గురైన ప్రజలు బిక్కుబిక్కుమంటూ ఇళ్లలోనే దాక్కున్నారు. అనంతరం ఈ గ్రామానికి 100 కిలోమీటర్ల దూరంలోని చ్కీజిజిబోలోనూ కాల్పులు చోటుచేసుకున్నాయి. ఆఫ్రికా ఖండంలోని ఈ పేద దేశంలో కొన్నేళ్లుగా ఉగ్రవాద దాడులు నానాటికీ పెరిగిపోతున్నాయి. జనవరి 10న జరిగిన ఇలాంటి దాడిలో 12 మంది చనిపోయారు. అన్సారుల్‌ ఇస్లామ్‌ అనే ఉగ్రవాద ముఠా ఎక్కువగా అక్కడ దాడులకు పాల్పడుతున్నట్లు తెలుస్తుంది