స్పీడు పెంచిన రష్మిక

వాస్తవం సినిమా: తెలుగులో రష్మిక చేసిన ‘ఛలో’ .. ‘గీత గోవిందం’ సినిమాలు విజయాలను అందుకున్నాయి. దాంతో ఆమెకి వరుస అవకాశాలు వస్తున్నాయి. ఇక కన్నడలోను ఆమె జోరు కొనసాగుతోంది. కన్నడలో ఆమె ‘దర్శన్’ జోడీగా ‘యజమాన’ సినిమా చేస్తోంది. ఇటీవల ‘స్వీడన్’లో మైనస్ 2 డిగ్రీల చలిలో దర్శన్ .. రష్మిక జంటపై ఒక పాటను చిత్రీకరించారట. విపరీతమైన మంచులో చలిని తట్టుకుంటూ .. ప్రేమ భావనలకు సంబంధించిన ఎక్స్ ప్రెషన్స్ రష్మిక అద్భుతంగా ఇవ్వడం యూనిట్ ని ఆశ్చర్య చకితులను చేసిందట. ఈ విషయాన్ని తాజా ఇంటర్వ్యూలో రష్మికనే చెప్పింది. శ్రేయ ఘోషల్ .. సోను నిగమ్ పాడిన ఈ పాట, ఈ సినిమాకి హైలైట్ గా నిలవనుందని అంది. ఈ మెలోడీ సాంగ్ కి రెండు రోజుల్లో దాదాపు 4 మిలియన్ల వ్యూస్ రావడం విశేషం. ఈ సినిమా హిట్ అయితే కన్నడలో రష్మిక మరింత బిజీకావడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.