కాపుల ఓట్ల కోసం బాబు మాయాజాలం..???

వాస్తవం ప్రతినిధి: చంద్రబాబు నాయుడు తిమ్మిని బిమ్మి , బిమ్మిని తిప్పి చేస్తారనే విషయం అందరికి తెలిసిందే. అయితే పప్పులు ఎప్పుడూ ఒకేలా ఉడకవనే విషయం మాత్రం బాబు తెలుసుకోలేకపోతున్నారు. వచ్చే ఎన్నికల్లో కాపుల ఓట్లు దూరం కానున్న నేపధ్యంలో ఇప్పుడు ఎదో ఒక రకంగా వారి ఓట్ల కోసం పడరాని పాట్లు పడుతుండగా. లక్ష కోట్ల జాక్ పాట్ తగిలినట్టుగా ఒక్క సారిగా మోడీ రూపంలో బాబు కి సాయం అందింది.

దాంతో ఇప్పుడు బాబు తనదైన వ్యూహంతో కాపుల ఓట్లని తన ఖాతాలో వేసుకోవడానికి వ్యుహాలని రచిస్తున్నాడు…అసలే కాపులు బాబు పై అగ్గిమీద గుగ్గిలం అవుతున్న తరుణంలో కాపుల ఓట్లు బాబుకి ఎలా పడుతాయి అంటూ ఎంతో మంది ప్రశ్నలు సంధిస్తున్న తరుణంలో బాబు ఈ వ్యుహంతోనే కాపుల ఓట్లని కొల్లగొట్టనున్నారు అంటూ విశ్లేషకులు తమ తమ అభిప్రాయాలని వెల్లడిస్తున్నారు.

ఇంతకీ కాపుల కోసం బాబు పన్నిన వ్యూహం ఏమిటంటే..?? అగ్రవర్ణాల పేదలకు నరేంద్ర మోడీ ప్రభుత్వం 10% రిజర్వేషన్ కొన్ని రోజుల క్రితం చట్టం చేసిన విషయం విధితమే అయితే ఆ చట్టం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలని రిజర్వేషన్లు అమలు విషయంలో తమ తమ రాష్ట్రాలకి అనుగుణంగా నిభంధనల మేరకు ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవచ్చు. ఈ పరిస్థితిని ఇప్పుడు చంద్రబాబు నాయుడు తనకి అనుకూలంగా మలుచుకోవడానికి వ్యూహాలు సిద్దం చేస్తున్నారు. ఏపీలో కాపులకు ఇచ్చిన 5% రిజర్వేషన్లను కల్పించేలా క్యాబినెట్ గతంలోనే తీర్మానం చేశారు.

ఒక వేళ కేంద్రం 10 శాతం ఇవ్వకుండా ఉండిఉంటే కాపులకి కేంద్రం అన్యాయం చేసిందనే సాకుతో కాపులకి దగ్గర అయ్యేవారు.కాని ఇప్పుడు కేంద్రం 10 శాతం ఇచ్చిన రిజర్వేషన్ ని అడ్డుగా పెట్టుకుని ఏపీ జనాభాలో 15 శాతం వరకూ కాపులు ఉన్నారని మిగిలిన వారిలో అగ్రవర్ణ పేదలు ఉన్నారని కాబట్టి వీరికి 5 శాతం రిజర్వేషన్లు ఇవ్వడం సరైనదే అనే ఆలోచనలో ఉంది..దాంతో కాపుల ఓట్లన్నీ తమకే అంటూ చంకలు గుద్దుకుంటున్న టీడీపీ కి దిమ్మతిరిగే షాక్ ఇస్తున్నారు కాపు నేతలు అసలు కాపులని నమ్మించి మోసం చేసిన ఏకైక పార్టీ టీడీపీనే అంటున్నారు.. అయినా ఇప్పుడు కేంద్రం ఇచ్చిన హక్కుని బాబేదో తాను కష్టపడి ఇచ్చిన వాడిలా హడావిడి చేస్తున్నాడని. కాపుల కోసం బాబు చేసింది ఏమీ లేదని ఇదే విషయాన్ని తమ కాపు కులస్తులకి చేరేలా చాటి చెప్తామని హెచ్చరిస్తున్నారు.