తిరిగి గాడిలో పడిన చమురు మార్కెట్: సౌదీ ఇంధన శాఖ మంత్రి

వాస్తవం ప్రతినిధి: చమురు ఎగుమతి దేశాల సంస్థ (ఒపెక్‌) చమురు ఎగుమతుల్లో కోత పెట్టటంతో ఇటీవల చమురు మార్కెట్‌ తిరిగి గాడిలో పడిందని సౌదీ ఇంధన శాఖ మంత్రి ఖలీద్‌ అల్‌ ఫలీ వ్యాఖ్యానించారు. 2018 చివరిలో గాడి తప్పిన చమురు మార్కెట్‌ ఇప్పుడు తిరిగి సమతుల్యతను చేరుకుని గాడిన పడిందని ఆదివారం అబూదాబీలో జరిగిన చమురు సదస్సులో వ్యాఖ్యానించారు. చమురు మార్కెట్‌లో సమతుల్యతను కొనసాగించేందుకు తాము ఒపెక్‌ సభ్యదేశాలతో కలిసి పనిచేస్తామని, ఈ లక్ష్యాన్ని సాధించటానికి అవసరమైతే మరింత ఎక్కువ కృషి చేస్తామని ఆయన చెప్పారు. తమ దేశం నవంబర్‌ నాటితో పోలిస్తే జనవరిలో పది శాతం మేర చమురు ఎగుమతులు తగ్గించిందని ఆయన గుర్తు చేశారు. ప్రస్తుతం 1.02 కోట్ల డాలర్ల బ్యారెళ్ల చమురును ఉత్పత్తిచేస్తున్న తమ దేశం ఈ నెల చివరి నాటికి ఉత్పత్తిని 72 లక్షల బ్యారెళ్ల స్థాయికి తగ్గించాలన్న లక్ష్యాన్ని చేరుకుంటుందని భావిస్తున్నామన్నారు.