ముంబై దాడులకు కుట్ర పన్నిన హుస్సేన్ రాణా  భారత్ కు!

వాస్తవం ప్రతినిధి: ముంబై దాడులకు కుట్ర పన్నిన తహవ్వూర్ హుస్సేన్ రాణా ను భారత్ కు తరలించే అవకాశం కనిపిస్తుంది. ముంబైలో జరిగిన 26/11 దాడులకు కుట్ర పన్నిన తహవ్వూర్‌ హుస్సేన్‌ రాణా ప్రస్తుతం అమెరికాలో జైలు శిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. అయితే అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ ప్రభుత్వం సంపూర్ణ సహకారంతో భారత ప్రభుత్వం ప్రస్తుతం రాణాను భారత్‌కు తరలించే అంశంపై తగిన చర్యలు చేపట్టిందని విశ్వసనీయ వర్గాల సమాచారం.