హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాది ని అరెస్ట్ చేసిన పోలీసులు

వాస్తవం ప్రతినిధి: హిజ్బుల్ ముజాహిద్దీన్ కు చెందిన ఉగ్రవాది సర్ఫరాజ్ అహ్మద్ షీర్ ను ఈ రోజు ఉదయం పోలీసులు అరెస్టు చేసినట్లు తెలుస్తుంది. బందీపోరాలో 13 రాష్ట్రీయ రైఫిల్స్, 162 బెటాలియన్ కు చెందిన బలగాలు సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించి సర్ఫరాజ్ ని అరెస్ట్ చేసినట్లు తెలుస్తుంది. సంయుక్త ఆపరేషన్ లో భాగంగా అహ్మద్ షీర్ ను అదుపులోకి తీసుకున్నట్లు బందీపోరా ఎస్సెస్పీ షేక్ జుల్ఫీకర్ ఆజాద్ వెల్లడించారు. ఉగ్రవాది నుంచి భారీ స్థాయిలో బుల్లెట్లు, ఇతర మందు గుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. గత ఐదేళ్ల నుంచి ఉగ్రవాద కార్యకలాపాల్లో సర్ఫరాజ్ చురుగ్గా పాల్గొంటున్నారని అధికారులు పేర్కొన్నారు.