కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..అదుపు తప్పి లోయలోపడ్డ టూరిస్టు బస్సు

వాస్తవం ప్రతినిధి: కర్నూలు జిల్లాలోని శ్రీశైలం ఘాట్ రోడ్డులోని చిన్నారుట్ల సమీపంలో ఓ టూరిస్టు బస్సు అదుపు తప్పి లోయలోకి దూసుకెళ్లింది. మహారాష్ట్ర నుంచి శ్రీశైలం వస్తుండగా ఇవాళ తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 50 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రయాణికులు సురక్షితంగా ఉండడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.