చట్ట రూపం దాల్చిన ఈబీసీల రిజర్వేషన్ల బిల్లు

వాస్తవం ప్రతినిధి: ఈబీసీలకు పది శాతం రిజర్వేషన్ల బిల్లుకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆమోద ముద్ర పడింది. ఇందుకు సంబంధించిన గెజిట్ విడుదలైంది. పది శాతం రిజర్వేషన్ల బిల్లుపై రాష్ట్రపతి సంతకంతో ఈ బిల్లుకు చట్ట రూపం లభించినట్టయింది. కాగా, 124వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఈ బిల్లుకు సవరణ చేశారు. లోక్ సభ, రాజ్యసభల్లో ఈబీసీల రిజర్వేషన్ బిల్లు’పై ఇటీవల ఓటింగ్ జరిగింది. ఈ బిల్లుకు లోక్ సభలో అనుకూలంగా 323 ఓట్లు, వ్యతిరేకంగా 3 ఓట్లు, రాజ్యసభలో 165 ఓట్లు, వ్యతిరేకంగా 7 ఓట్లు లభించిన విషయం తెలిసిందే.