హైదరాబాద్ లో దారుణ ఘటన….16 ఏళ్ల బాలిక పై 11 మంది సామూహిక అత్యాచారం

వాస్తవం ప్రతినిధి: హైదరాబాద్ లోని కామాటీపురా పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. గొల్లాకిడికి చెందిన 16 ఏళ్ల మైనర్‌ బాలికపై 11మంది దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు తెలుస్తుంది. కామాటీపుర పోలీస్‌ స్టేషన్‌లో బాధితురాలి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..గొల్లాకిడికి చెందిన 16ఏళ్ల బాలికపై 11 మంది కామాంధులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అత్యాచారం చేసిన సమయంలో వీడియోలు తీసి బాధితురాలిని బెదిరిస్తూ నరకం చూపించారు. ఈ విషయాన్ని బయటపెడితే సోషల్‌మీడియాలో వీడియో పెట్టి వైరల్‌ చేస్తామని బెదిరింపులకు దిగారు. కామాంధుల చేష్టలతో విసిగిపోయిన బాధితురాలు ఈ విషయాన్ని కుటుంబసభ్యులకు చెప్పింది. దీంతో తల్లిదండ్రులు గత నెల 24న కామాటీపుర పోలీస్‌స్టేషన్ ఫిర్యాదు చేశారు. బాలికపై గత నాలుగేళ్ల నుంచి అత్యాచారానికి పాల్పడినట్లుగా వైద్యుల రిపోర్టులలో తేలిందని తల్లిదండ్రులు చెప్పారు. ఆదివారం సుమారు 200 మంది స్థానికులు పోలీస్‌స్టేషన్ వద్దకు చేరుకుని ఆందోళన చేపట్టారు.నిందితులకు పోలీసులు సహకరిస్తున్నారని, బాలికకు నరకం చూపించిన ఆ కామాంధులను కఠినంగా శిక్షించాలని వారంతా డిమాండ్ చేస్తున్నారు.