వ్యవస్థలో మార్పు కోసమే పార్టీ: పవన్

వాస్తవం ప్రతినిధి: మన వ్యవస్థలో మార్పు తీసుకురావడానికే జనసేన పార్టీని స్థాపించానంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. గుంటూరు జిల్లా పెదరావూరులో బహిరంగ సభలో మాట్లాడిన ఆయన పై వ్యాఖ్యలు చేసారు. భవిష్యత్తు తరాలకు అండగా ఉండేందుకే రాజకీయాల్లోకి వచ్చానని, తప్పుడు రాజకీయ వ్యవస్థను మార్చే శక్తి యువతకే ఉందంటూ జనసైనికుడు అభిప్రాయపడ్డారు.  అంతేకాకుండా పదవులు ఆశించి రాజకీయాల్లోకి రాలేదని,వ్యవస్థలో మార్పు కోసమే ఈ పార్టీ అని పవన్ అన్నారు. అలానే అవినీతిపై పోరాటం చేయడం యువత వల్లే సాధ్యమవుతుందని, మబ్బుల్లో పరుగెత్తే పిడుగులు జనసైనికులని పవన్ కల్యాణ్ అన్నారు.