ప్రపంచ బ్యాంక్ అధిపతి రేసులో ట్రంప్ గారాల పట్టి

వాస్తవం ప్రతినిధి: ప్రపంచ బ్యాంక్ అధిపతి పదవి రేసులో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ గారాల పట్టి ఇవాంక ట్రంప్ ఉందా అని అంటే నిజమే అని తెలుస్తుంది. ట్రంప్ గారాల పాటి ఇవాంక ట్రంప్‌ ప్రపంచ బ్యాంక్‌ అధిపతి పదవికి జరుగుతున్న రేసులో ఉన్నట్లు ఓ ఆంగ్లపత్రిక పేర్కొన్నట్లు తెలుస్తుంది. ప్రపంచ బ్యాంక్‌ప్రస్తుత అధిపతి జిమ్‌ యంగ్‌ కిమ్‌ ఫిబ్రవరి 1వ తేదీ నుంచి పదవి నుంచి వైదొలగనున్న సంగతి తెలిసిందే. ఆయన మరోక ప్రైవేటు సంస్థలో కీలక బాధ్యతలు చేపట్టనున్నారు. దీంతో ప్రపంచ బ్యాంక్‌ అధిపతికోసం అన్వేషణ మొదలైంది. ఇప్పటి వరకు ప్రపంచ బ్యాంక్‌లో అత్యధిక వాటా ఉన్న అమెరికా మద్దతు లభించిన వారికే అధ్యక్ష పదవి దక్కింది. ఈ నేపథ్యంలో అమెరికా ట్రెజరీ డిపార్టుమెంట్‌కు పలు నామినేషన్లు అందుతున్నాయి. వీటిల్లో డేవిడ్‌ మల్ఫాస్‌, నిక్కీ హేలీ వంటి హేమాహేమీల పేర్లు ఈ నామినేషన్లలో ఉన్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ కుమార్తె ఇవాంక ట్రంప్‌ పేరు కూడా వీటిలో ఉన్నట్లు తెలుస్తుంది. ఇతర దేశాల నుంచి కూడా ఈ పదవికి పోటీ ఉన్నా ప్రస్తుత పరిస్థితుల్లో అమెరికాయేతరులకు ఈ పదవి అప్పగించేందుకు అగ్రరాజ్యం ఆసక్తి చూపకపోవచ్చు అని విశ్లేషకులు భావిస్తున్నారు.  37ఏళ్ల ఇవాంక ట్రంప్‌ అమెరికా అధ్యక్షుడికి సీనియర్‌ అడ్వైజర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. జులైలో ఆమె తన ఫ్యాషన్‌ బ్రాండ్‌ను మూసివేసి శ్వేతసౌధ కార్యకలాపాలపై పూర్తిగా దృష్టి సారించిన ఆమె  ట్రంప్ అధ్యక్షుడు అయ్యాక ఆమె బ్రాండ్ల విక్రయాలు పూర్తి స్థాయిలో పడిపోయాయి.