గాజా లో ఘర్షణలు!

వాస్తవం ప్రతినిధి: గాజా లో ఘర్షణలు చోటుచేసుకున్నట్లు తెలుస్తుంది. తూర్పు గాజాలో వందలాదిమంది పాలస్తీనా ప్రదర్శకులు, ఇజ్రాయిల్‌ సైనికుల మధ్య ఘర్షణలు చెలరేగాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఇజ్రాయిల్‌ సరిహద్దుకు సమీపంలో వున్న ఈ ప్రాంతంలో ఇజ్రాయిల్‌ సైనికుల తూటాలకు, రబ్బర్‌ బుల్లెట్లకు, బాష్పవాయు గోళాలకు అనేకమంది పాలస్తీనియన్లు గాయపడ్డారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. గతేడాది మార్చి నుండి ప్రతి వారం జరుగుతున్న ఇజ్రాయిల్‌ వ్యతిరేక ప్రదర్శనల్లో భాగంగా శుక్రవారం నాటి నిరసనలు సాగాయి. గత 42 శుక్రవారాలుగా ఈ ఘర్షణలు కొనసాగుతున్నాయి.. పాలస్తీనా పతాకాలు చేబూని, ఇజ్రాయిల్‌ వ్యతిరేక నినాదాలు చేస్తూ వందలాదిమంది ఆందోళనకారులు ప్రదర్శనల్లో పాల్గొన్నట్లు తెలుస్తుంది.