సిమెంట్ ఇటుకల పరిశ్రమలో పేలుడు!

వాస్తవం ప్రతినిధి: గోవా లోని ఒక సిమెంట్ ఇటుకల పరిశ్రమలో పేలుడు సంభవించినట్లు తెలుస్తుంది. గోవాలోని ట్యూమ్ ఇండస్ట్రీలయల్ ఎస్టేట్‌లో ఈ ప్రమాదం సంభవించింది. అయితే ఈ ప్రమాదంలో 9 మంది తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తుంది. దీనితో సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకొని సహాయక చర్యలు చేపట్టింది. ఈ ఘటనలో గాయపడిన క్షతగాత్రులను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అయితే గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.