ఫ్రాన్స్ రాజధాని పారిస్ లో భారీ పేలుడు!

వాస్తవం ప్రతినిధి: ఫ్రాన్స్‌ రాజధాని పారిస్‌ లో భారీ పేలుడు చోటుచేసుకుంది. 9వ అరోన్‌డిస్‌మెంట్‌ ప్రాంగణంలో శనివారం ఉదయం భారీ పేలుడు సంభవించినట్లు తెలుస్తుంది. దీంతో పెద్ద ఎత్తున మంటలు కూడా చెలరేగాయి. వెంటనే  విషయం తెలుసుకున్న అగ్నిమాపక దళాలు సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. పేలుడు కారణంగా అక్కడి భవనాలు ధ్వంసమైనట్లు తెలుస్తుంది. దీనితో పరిసర ప్రాంతాలు భీతావహంగా మారాయి. ఈ ప్రమాదంలో పలువురు గాయపడినట్లు తెలుస్తోంది. అయితే.. ఎవరైనా ప్రాణాలు కోల్పోయారా అనే వివరాలు మాత్రం తెలియాల్సి ఉంది. అలానే పేలుడుకు గల కారణాలు కూడా ఇంకా తెలియరాలేదు. పేలుడుకు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. మరోపక్క ప్రజలెవరూ ఘటనా స్థలం వైపు రావొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ప్రమాదం జరిగిన భవనంలోని ఓ బేకరీలో గ్యాస్‌ లీకై పేలుడు సంభవించినట్లు పోలీసులు చెబుతున్నారు.