12 ఏండ్ల మైనర్ బాలిక పై అక్రుత్యానికి పాల్పడిన భారత్ కు చెందిన వ్యక్తి….13 ఏళ్ల జైలు

వాస్తవం ప్రతినిధి: పన్నెండేళ్ల మైనర్‌ బాలికకు మాయమాటలు చెప్పి అకృత్యానికి పాల్పడిన భారత్‌కు చెందిన ఓ వ్యక్తికి 13 ఏళ్ల జైలు, 12 కొరడా దెబ్బలు శిక్షగా విధిస్తూ సింగపూర్‌ హైకోర్టు తాజాగా తీర్పు వెలువరించింది. అక్కడి మినిమార్ట్‌లో పనిచేసే ఉదయ్‌కుమార్‌ దక్షిణామూర్తి (31) అనే వ్యక్తి షాప్‌నకు వచ్చిన ఓ బాలికకు ఉచితంగా తినుబండారాలు, ఆడుకొనే బొమ్మలు ఇచ్చి వశపర్చుకున్నాడు. మూడు నెలలపాటు అత్యాచారానికి పాల్పడ్డాడు. చివరికి తన గర్ల్‌ఫ్రెండ్‌కు అనుమానం రావడంతో ఈ కామాంధుడి లీలలు వెలుగుచూశాయి. ఈ ఘటన 2016లో చోటుచేసుకోగా 2019 జనవరి 10న నేర నిరూపణ అయింది.