4 పరుగుల తేడాతో ఓటమి పాలైన టీమిండియా

వాస్తవం ప్రతినిధి: ఈ రోజు భారత్-ఆస్టేలియా జట్ల మధ్య తోలి వన్డే జరిగింది. అయితే ఈ మ్యాచ్ లో టీమిండియా 34 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా చేతిలో ఓటమిపాలైంది. ఆసీస్‌ నిర్దేశించిన 289 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో తడబడిన టీమిండియా అపజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఆదిలోనే మూడు వికెట్లు కోల్పోయిన కోహ్లీసేన క్రీజులో నిలదొక్కుకోవడానికి శ్రమించింది. రోహిత్‌ శర్మ(133), ధోని(51) రాణించినా టీమిండియాకు విజయం దక్కలేదు. రిచర్డ్‌సన్‌ నాలుగు వికెట్లు తీయగా.. స్టోయినస్‌, బెహ్రెన్‌డోర్ఫ్‌ చెరో రెండు వికెట్లు, పీటర్‌ సిడిల్‌ ఒక వికెట్‌ తీశారు. దీంతో నిర్ణీత 50 ఓవర్లలో టీమిండియా 9వికెట్ల నష్టానికి 254పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌లో ఆసీస్‌ 0-1 ఆధిక్యంలో నిలిచింది