పాండ్య స్థానంలో జడేజా కు అవకాశం

వాస్తవం ప్రతినిధి: ఆసీస్‌తో జరగబోయే తొలి వన్డేకు టీమిండియా జట్టులో హార్దిక్ పాండ్య కు బదులుగా రవీంద్ర జడేజా కు స్థానం కల్పించినట్లు తెలుస్తుంది. ఇటీవల ఒక టీవీ షో లో పాల్గొన్న హార్దిక్ పాండ్య,కేఎల్ రాహుల్ పై బీసీసీఐ వేటు వేసిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో పాండ్య స్థానంలో జడేజా కు అవకాశం కల్పించినట్లు తెలుస్తుంది. టీమిండియా సారథి విరాట్‌ కోహ్లీ మనసులోనూ ఇదే ఉందని తెలుస్తోంది. శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో కోహ్లీ ఈ విషయాన్ని ప్రస్తావించాడు. బీసీసీఐ తీర్పు కోసం ఎదురుచూస్తున్నామని, ఒక వేళ పాండ్య మీద నిషేధం పడినట్లయితే జడేజాను తీసుకునే అవకాశాలున్నాయని నర్మగర్భంగా చెప్పుకొచ్చాడు.