అనుష్క సినిమాలో తాను నటించడం లేదన్న మాధవన్

వాస్తవం సినిమా: హేమంత్ మధుకర్ దర్శకత్వంలో అనుష్క ప్రధాన పాత్రధారిగా ఒక సినిమాను రూపొందించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాకి ఒక నిర్మాతగా కోన వెంకట్ వ్యవహరిస్తున్నాడు. కథ నేపథ్యం ప్రకారం ‘సైలెన్స్’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్రలో మాధవన్ నటించనున్నట్టుగా కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఈ విషయంపై తాజాగా మాధవన్ స్పందించాడు.

అనుష్క సినిమాలో తాను నటించడం లేదని అన్నాడు. ప్రస్తుతం ఏ సినిమాలోను కీ రోల్స్ చేయడానికి తాను అంగీకారాన్ని తెలపలేదని స్పష్టం చేశాడు. దాంతో ఇంతవరకూ జరిగిన ప్రచారానికి తెరపడినట్టు అయింది. ఈ సినిమాలో హాలీవుడ్ స్టార్ హీరో మైఖేల్ మాడ్సన్ నటించనున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. వినికిడి శక్తిలేని మూగ యువతిగా ఈ సినిమాలో అనుష్క కనిపించనుందనే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది. మార్చి నుంచి సెట్స్ పైకి వెళుతోన్న ఈ సినిమా, అమెరికాలో ఎక్కువభాగం షూటింగ్ జరుపుకోనున్నట్టు తెలుస్తోంది.