పెరిగిన గెడ్డంతో కొత్త లుక్ తో గోపీచంద్

వాస్తవం సినిమా: కొంతకాలంగా గోపీచంద్ సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఈ సారి తప్పకుండా హిట్ కొట్టాలనే ఉద్దేశంతో ఆయన కొంత గ్యాప్ తీసుకున్నాడు. ఇటీవల దర్శకుడు ‘తిరు’ వినిపించిన కథకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అనిల్ సుంకర నిర్మిస్తోన్న ఈ సినిమాను ఇటీవలే లాంచ్ చేశారు. టైటిల్ ఖరారు చేయని ఈ సినిమాలో గోపీచంద్ పెరిగిన గెడ్డంతో కొత్త లుక్ తో కనిపించనున్నాడు.

సాధారణంగా గోపీచంద్ కథాకథనాలపై దృష్టి పెడతాడేగానీ, లుక్స్ మార్చాలనే ఆలోచన చేయడు. కానీ ఈ సినిమాలో మాత్రం ఆయన కొత్త లుక్ తో కనిపించడానికి రెడీ అవుతున్నాడు. ఆ లుక్ కి సంబంధించిన స్టిల్ ఒకటి బయటికి వచ్చింది. నిజంగానే ఈ లుక్ లో గోపీచంద్ చాలా కొత్తగా కనిపిస్తున్నాడు. ఈ సినిమా తరువాత సంపత్ నంది దర్శకత్వంలో గోపీచంద్ ఒక సినిమా చేయనున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ ఇద్దరి కాంబినేషన్లో గతంలో ‘గౌతమ్ నంద’ తెరకెక్కిన సంగతి తెలిసిందే. త్వరలోనే కొత్త ప్రాజెక్టుకి సంబంధించిన వివరాలు తెలియనున్నాయి.