అనుష్క సినిమాలో హాలీవుడ్ స్టార్ హీరో

వాస్తవం ప్రతినిధి: భాగమతి తర్వాత సుదీర్ఘ విరామం తీసుకుని ఇన్నాళ్లకు ఒక సినిమాకు ఓకే చెప్పింది టాలీవుడ్ స్వీటీ అనుష్క. ‘వస్తాడు నా రాజు’ చిత్రం ఫేం హేమంత్ మధుకర్ దర్శకత్వంలో అనుష్క తన తదుపరి చిత్రాన్ని చేసేందుకు కమిట్ అయ్యింది. ఈ సినిమాకి ‘సైలెన్స్’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. ఈ సినిమాలో హాలీవుడ్ స్టార్ హీరో ‘మైఖేల్ మాడ్సన్’ కీలకమైన పాత్రలో కనిపించనున్నాడనేది తాజా సమాచారం. ఈ సినిమా ఎక్కువభాగం చిత్రీకరణ అమెరికాలో జరగనుంది. అక్కడి షూటింగులో ఆయన పాల్గొంటాడట. హాలీవుడ్ స్టార్ హీరో ఈ సినిమాలో చేయనున్నారనే విషయం ఈ సినిమాపై మరింత ఆసక్తిని పెంచేస్తోంది. కథా నేపథ్యం ఏమై ఉంటుందా అనే విషయంపై అందరూ ఆత్రుత చూపుతున్నారు.